ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS Leader Srinivas Goud: తెలంగాణ డెయిరీలను ఖతం చేసే కుట్ర జరుగుతోంది..

ABN, Publish Date - Aug 13 , 2024 | 04:03 PM

తెలంగాణ పాల డెయిరీలను ఖతం చేసే కార్యక్రమం జరుగుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. పాలు పోసిన తెలంగాణ పాడి రైతులకు డబ్బులు చెల్లించకుండా వేధిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి ప్రెస్ మీట్ నిర్వహించారు.

హైదరాబాద్: తెలంగాణ పాల డెయిరీలను ఖతం చేసే కార్యక్రమం జరుగుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. పాలు పోసిన తెలంగాణ పాడి రైతులకు డబ్బులు చెల్లించకుండా వేధిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి ప్రెస్ మీట్ నిర్వహించారు. గతంలో రైతులు వ్యవసాయంతోపాటు పశువులపైనా ఆధారపడే వారని, రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన అన్నారు. నాలుగు నెలలు గడుస్తున్నా పాడి రైతులకు డబ్బులు ఇవ్వకుండా వారిని మనోవేదనకు గురి చేస్తున్నారంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆంధ్ర డెయిరీలను పెంచి పోషిస్తున్నారా?

హైదరాబాద్‌లో రోజుకు 30లక్షల లీటర్ల పాలు వినియోగిస్తున్నారని, కానీ తెలంగాణ రైతులు అందించేది కేవలం 5లక్షల లీటర్లు మాత్రమే ఆయన చెప్పారు. అలాంటప్పుడు మిగిలిన 25లక్షల పాలు ఎక్కడ్నుంచి వస్తున్నాయో తెలంగాణ ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 5లక్షల లీటర్లకు నగదు చెల్లించకుండా తెలంగాణ డెయిరీలని బొందపెట్టి ఆంధ్రా డెయిరీలను పెంచి పోషిస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకం, దానాకు సైతం నగదు అందించినట్లు మాజీ మంత్రి గుర్తు చేశారు. విజయ డెయిరీలో ఉన్న 500కోట్ల పాల ఉత్పత్తులను యాదాద్రి లేదా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాలకు విక్రయిస్తే బాగుంటుందని శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.


విజయ డెయిరీని ఖతం చేసే ప్రయత్నం..!

హైదరాబాద్‌కు రోజుకు సరఫరా అయ్యే 30లక్షల లీటర్ల పాలను ఎవరు సరఫరా చేస్తున్నారో చెప్పాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లాభాలు లేక పాడి రైతులు పొట్టచేత పట్టుకుని రాష్ట్రం విడిచి వెళ్లే పరిస్థితిని సృష్టిస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజూ రాష్ట్రవ్యాప్తంగా 50లక్షల లీటర్ల పాలు అవసరం అవుతాయని, అందుకు అనుగుణంగా పాల ఉత్పత్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని లేకుంటే పాడి రైతులతో కలిసి వచ్చే పదిహేను రోజుల్లో పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పాల ఉత్పత్తి తగ్గితే కల్తీ పాల దందా పెరుగుతుందని, అది ఆరోగ్యానికి ఎంతో హానికరమని శ్రీనివాస్ గౌడ్ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదిహేను రోజులకు ఒకసారి రైతులకు నగదు చెల్లించామని, అప్పుడు పాల ఉత్పత్తి పెరిగితే ఇప్పుడు తగ్గుతోందని ఆయన మండిపడ్డారు. విజయ డెయిరీని ఖతం చేసే ప్రయత్నం జరుగుతోందంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు.


కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరూ సంతోషంగా లేరు..

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో హాస్టళ్లు, యూనివర్సిటీలు, గురుకులాల్లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఎవ్వరూ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంతోషంగా లేరని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాట కార్యాచరణ ప్రకటించబోతున్నట్లు మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా కాంగ్రెస్ పాలనపై దృష్టిపెట్టి ప్రజా సమస్యల పరిష్కార దిశగా ముందుకు సాగాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

ఈ వార్త కూడా చదవండి:

Bhatti Vikramarka: విద్యార్థుల మృతిపై ఆరా తీసిన భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్..

Updated Date - Aug 13 , 2024 | 04:05 PM

Advertising
Advertising
<