ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi liquor scam: దిల్లీ మద్యం కేసు.. పిటిషన్ విచారణ వాయిదా: సుప్రీంకోర్టు..

ABN, Publish Date - Feb 16 , 2024 | 04:22 PM

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 28న విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లతో కాకుండా

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 28న విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లతో కాకుండా కవిత పిటిషన్ ప్రత్యేకంగా విచారిస్తామని తెలిపింది. లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన నోటీసులను కవిత గతేడాది సుప్రీంకోర్టులో సవాలు చేశారు. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ల బెంచ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. అయితే.. సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణ కేసు విచారణ పెండింగ్ లో ఉండటంతో లిక్కర్ కేసులో ఈడీ నోటీసులకు కవిత గైర్హాజరవుతున్నారు.

కాగా.. దిల్లీ మద్యం కేసులో భాగంగా గతేడాది మార్చిలో కవితను ఈడీ అధికారులు మూడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ క్రమంలో ఈడీ కార్యాలయం వద్ద కాకుండా మహిళ కాబట్టి తనను ఇంటి వద్దే విచారించాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. విచారణకు హాజరు కాలేనన్న కవిత సమాధానంపై ఈడీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 16 , 2024 | 04:58 PM

Advertising
Advertising