ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హత్యా?.. ఆత్మహత్యా?

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:21 PM

Telangana: నర్సింగ్ విద్యార్థినిది హత్యా?.. ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. విద్యార్థిని మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని చనిపోయిన రూంతో పాటు.. కింద స్నేహితులతో కలిసున్నటువంటి రూంలో కూడా ఇప్పటికే పోలీసులు కొన్ని క్లూస్‌ను సేకరించారు.

Suspicious death of nursing student

హైదరాబాద్, సెప్టెంబర్ 16: నగరంలోని గచ్చిబౌలిలో (Gachibowli) ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జడ్చర్లకు చెందిన నర్సింగ్ విద్యార్థిని గచ్చిబౌలిలోని రెడ్‌స్టోన్ హోటల్‌లో ఫ్యానుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. అయితే విద్యార్థినిని అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. N

arendra Modi: ప్రధాని మోదీ పుట్టినరోజు నేపథ్యంలో.. 13 ఏళ్ల చిన్నారి స్పెషల్ గిఫ్ట్



హోటల్‌లో సీసీ టీవీ ఫుటేజ్, విద్యార్థిని మొబైల్, వాట్సప్‌ మెసేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత విద్యార్థినికి ఇంటర్నెల్‌గా ఏమైనా గాయాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది. ప్రాథమిక విచారణలో విద్యార్థినిది ఆత్మహత్యే అనే పోలీసులు నిర్ధారణకు వచ్చినప్పటికీ పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే ఈ కేసులో మరికొన్ని అంశాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.


నర్సింగ్ విద్యార్థినిది హత్యా?.. ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. విద్యార్థిని మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని చనిపోయిన రూంతో పాటు.. కింద స్నేహితులతో కలిసున్నటువంటి రూంలో కూడా ఇప్పటికే పోలీసులు కొన్ని క్లూస్‌ను సేకరించారు. విద్యార్థిని మృతిపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతుండటంతో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

YS Viveka Murder Case:వివేకా కేసులో అవినాష్‌ను కాపాడుతున్న జగన్.. అసలు కారణం అదేనా..



విద్యార్థిని తండ్రి మాటల్లో...

‘‘మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది రావాలని.. మాకు నిన్న రాత్రి కాల్ వచ్చింది. మేము హుటాహుటిన ఇక్కడకు వచ్చేసరికి మృతదేహాన్ని అంబులెన్స్‌లో పెట్టారు. రూంలో ఏం జరిగిందో మాకు తెలియదు. హత్య చేశారా.. లేక ఇంకా ఏదైనా అనేదా మాకు తెలియదు. మేము వచ్చేసరికి మృతదేహాన్ని కిందకు తీసుకువచ్చారు. ఉరి వేసుకుందని చెబుతున్నారు. కూతురి ఒంటిపై గాయాలు ఉన్నాయి. తెలిసిన వాళ్లతోనే మా అమ్మాయి ఉంది. అంతా కలిసే భోజనం చేశారు. ఆ తరువాత మా కూతురిని వాళ్లు ఏం చేశారో తెలియదు. మాకు ఉరి వేసుకుందని ఫోన్‌లో చెప్పారు. మా కూతురును హత్య చేశారు. మాకు న్యాయం కావాలి’’ అంటూ విద్యార్థిని తండ్రి డిమాండ్ చేశారు.


నా కూతురు పిరికిది కాదు.. తల్లి ఆవేదన

‘‘శనివారం మాతో మాట్లాడింది. నా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఒకరికి ధైర్యం చెబుతుందే కానీ అలా చేసి ఉండదు. నా బిడ్డను ఏదో చేసి చంపారు. జాబ్ గురించి ఎప్పుడూ బాధపడలేదు. రూం ఖాళీ చేస్తాను అని చెప్పింది. శనివారం మాట్లాడింది.. ఆదివారం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నా బిడ్డ ఒంటిపైన గాయాలు ఉన్నాయి. అమ్మాయి స్నేహితులే ఏదో చేశారు’’ అంటూ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

Jobs: ఈ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎస్‌బీఐలో 1511 పోస్టులకు అప్లై చేశారా లేదా..

KTR: తెలంగాణ తల్లిని అవమానిస్తారా?.. ప్రభుత్వంపై కేటీఆర్‌ ఆగ్రహం

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 16 , 2024 | 12:26 PM

Advertising
Advertising