Chandrababu: తెలంగాణపై ఫోకస్.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ABN, Publish Date - Aug 10 , 2024 | 11:27 AM
Telangana: తెలంగాణలో పార్టీ బలోపేతంపై టీడీపీ అధినేత ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్‌కు భవన్‌కు చంద్రబాబు రానున్నారు. పార్టీ ముఖ్యనేతలో ఏపీ సీఎం సమావేశం అవనున్నారు. ఆడహక్ కమిటీ వేసి జిల్లాల వారిగా సభ్యత్వ నమోదు చేపట్టడం బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలు వేయడం, పార్టీని సంస్థాగతంగా బలోపేతంపై నేతలను దిశానిర్దేశం చేయనున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 10: అనుకున్న విధంగానే ఏపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏపీ అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu). అధికారం చేపట్టినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అడుగులు ముందుకు వేస్తున్నారు. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయంటూ ఆయా రంగాలకు సంబంధించి ఇప్పటికే శ్వేతపత్రాలను కూడా విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవినీతిని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ అధికారులను అలర్ట్ చేస్తున్నారు. వైసీపీ నేతల్లా వ్యవహరించవద్దంటూ పదే పదే పార్టీ నేతలను, అధికారులను హెచ్చిరిస్తూనే ఉన్నారు. అలా ఏపీలో తన మార్క్‌ను చూపించుకున్న సీబీఎన్ ఇప్పుడు తెలంగాణపై (Telangana) దృష్టిసారించారు.
Telugu Desam: కొలిక్కిరాని కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక.. ఎందుకింత కన్ఫూజన్!
తెలంగాణపై...
తెలంగాణలో పార్టీ బలోపేతంపై టీడీపీ అధినేత ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్‌కు భవన్‌కు చంద్రబాబు రానున్నారు. పార్టీ ముఖ్యనేతలో ఏపీ సీఎం సమావేశం అవనున్నారు. ఆడహక్ కమిటీ వేసి జిల్లాల వారిగా సభ్యత్వ నమోదు చేపట్టడం బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలు వేయడం, పార్టీని సంస్థాగతంగా బలోపేతంపై నేతలను దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడిపై అభిప్రాయ సేకరణ చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై పార్టీ నేతలను ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా ఎల్ రమణను నియమించగా.. ఆ తరువాత ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. అనంతరం కాసాని జ్ఞానేశ్వర్‌ను అధ్యక్షుడిగా నియమించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాసాని కూడా బీఆర్ఎస్‌లో చేరారు. దీంతో బక్కని నర్సింహులు ప్రస్తుతం తెలంగాణ టీడీపీ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఇటీవల ఏపీలో జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలోనూ తెలంగాణలో పార్టీ స్థితిగతిపై చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఇప్పటికీ పదిశాతానికి పైగా ఓటు బ్యాంక్ టీడీపీకి ఉండటంతో.. పార్టీని యాక్టీవ్ చేయాలని నిర్ణయించారు. తెలంగాణలోనూ టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలని సమావేశంలో తీర్మానించారు.
ఇవి కూడా చదవండి...
Viral Video: గంటకు 800కి.మీ వేగంతో దూసుకెళ్లే విమానం.. పైనుంచి చూడగా గుండె ఆగిపోయే సీన్..
TG Police: బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ పోలీస్‌శాఖ అలర్ట్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 10 , 2024 | 11:29 AM