ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Assembly: ఆరో రోజూ.. హాట్ హాట్‌గానే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!

ABN, Publish Date - Jul 30 , 2024 | 10:43 AM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరవ రోజు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సోమవారం సభ చాలా వాడీ వేడీగా జరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇక ఇవాళ కూడా శాసన సభలో ప్రశోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Meetings) ఆరవ రోజు (6th Day) మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సోమవారం సభ వాడీ వేడీగా జరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇక ఇవాళ కూడా శాసన సభలో ప్రశోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు. స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చ జరగనుంది. దీనిని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) సభలో ప్రవేశపెట్టారు. ఈ రోజు కూడా 19 పద్దులపై చర్చలు జరగనున్నాయి. మత్స్య శాఖ, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీస్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై పద్దులపై శాసన సభలో చర్చ జరగనుంది.


ఇంకా వ్యవసాయ శాఖ, టూరిజం శాఖల పద్దులపై శాసనసభ చర్చించనుంది. దేవాదాయ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల పద్దులపై శాసన సభలో సభ్యులు చర్చించనున్నారు. రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, మాతా శిశు సంక్షేమ పద్దులపై సభలో చర్చ జరుగనుంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, హౌసింగ్, ఐ అండ్ పీఆర్‌లపై సభ్యులు చర్చించనున్నారు. ఇరిగేషన్, సివిల్ సప్లైపై సభలో వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా అసెంబ్లీ వేదికగా రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమం జరుగనుంది. ఒకటిన్నర లక్షల రుణాల వరకు నేడు రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ చేయనుంది. రెండో విడతలో 7 లక్షల మంది రైతులకు రూ. 6,100 కోట్ల లబ్ది చేకూరనుంది. మధ్యాహ్నం 1 గంటకు అసెంబ్లీ ఆవరణలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీ కోచింగ్ సెంటర్ కేసులో కీలక మలుపు..

తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై వాడి వేడిగా చర్చ..

సభలో ఎమోషనల్ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 30 , 2024 | 11:47 AM

Advertising
Advertising
<