TG Govt: 21న తెలంగాణ కేబినెట్ సమావేశం.. రుణమాఫీపై రేవంత్ సర్కార్ కసరత్తు
ABN, Publish Date - Jun 18 , 2024 | 10:10 PM
తెలంగాణ రైతులకు మరో శుభవార్త చెప్పేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హామీ ఇచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ రైతులకు మరో శుభవార్త చెప్పేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని లోక్ సభ ఎన్నికల్లో సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకంటే ముందే రుణమాఫీ చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే రైతు రుణమాఫీకి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
తొందరలోనే రైతులు గుడ్ న్యూస్ వింటారని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఈ నెల21న కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో రైతు రుణమాఫీ అమలుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. రాబోయే ఐదేళ్లకు సంబంధించి సంక్షేమ, అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలన్న అంశంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.
ఈ మేరకు నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరో వైపు మాఫీ అమలుకు విధివిధానాలపై కసరత్తు చేస్తోంది. అర్హులైన వారికే రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు వివిధ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌కం ట్యాక్స్ చెల్లించే వారు, ఉద్యోగులను దీని నుంచి మినహాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
Updated Date - Jun 18 , 2024 | 10:11 PM