CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్.. ఏం చేయబోతున్నారు..!?
ABN, Publish Date - Aug 15 , 2024 | 08:48 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇవాళ(గురువారం) రాత్రి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రెండ్రోజులపాటు పర్యటించి వివిధ కంపెనీలతో భేటీ కానున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అధిష్ఠానం పెద్దలతో మాట్లాడనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గురువారం రాత్రి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రెండ్రోజులపాటు పర్యటించి వివిధ కంపెనీలతో భేటీ కానున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అధిష్ఠానం పెద్దలతో మాట్లాడనున్నారు. ఇటీవలే అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం మరోసారి ఢిల్లీకి వెళ్లనుండడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండ్రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం రోజున ఆపిల్, ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై వారితో చర్చించనున్నారు. అలాగే శనివారం రోజున హై కమాండ్‌తో భేటీ కానున్నారు. నూతన పీసీసీ చీఫ్, మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోనియా గాంధీని ఆహ్వానించనున్నారు. అలాగే వరంగల్‌లో నిర్వహించే రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తారు. అదే రోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Road Accident: పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం..
TG News: తెలంగాణేతరులకు రాజ్యసభ సీటు కేటాయించడంపై బీఆర్ఎస్ ఫైర్..
Minister Tummala: పది వేల కోట్లు ఖర్చయినా మాట నిలబెట్టుకుంటాం..
Updated Date - Aug 15 , 2024 | 09:01 PM