Share News

Big Breaking: జానీ మాస్టర్‌కు బెయిల్ వచ్చేసింది..

ABN , Publish Date - Oct 24 , 2024 | 12:28 PM

Jani Master Bail: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు.. జానీ మాస్టర్‌కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. లేడీ కొరియోగ్రాఫర్‌పై

Big Breaking: జానీ మాస్టర్‌కు బెయిల్ వచ్చేసింది..
Jani Master

హైదరాబాద్, అక్టోబర్ 24: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు.. జానీ మాస్టర్‌కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులోనే గత రెండు వారాలుగా చంచల్‌గూడా జైల్లో ఉన్నారు జానీ మాస్టర్.


జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ఓ యువతి.. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. బాధిత యువతి పిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు.. జానీ మాస్టర్‌పై పోక్సో చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ పరిణామం తరువాత జానీ మాస్టర్ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చివరికి ఆయన గోవాలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.


జానీ మాస్టర్‌పై చర్యలు..

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌కు జనసేన పార్టీ షాక్ ఇచ్చింది. ఆ పార్టీలో సభ్యుడిగా ఉన్న ఆయన్ను జనసేన అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. మా అసోసియేషన్ సైతం ఆయనపై సస్పెన్షన్ విధించింది. అటు పోలీసు కేసులు.. ఇటు జనసేన, మా అసోసియేషన్ చర్యలతో జానీ మాస్టర్‌కు బిగ్ షాక్ తగిలింది.


జాతీయ అవార్డు వెనక్కి..

తొలుత జానీ మాస్టర్‌కు బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డును ప్రకటించారు. అయితే, లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఈ అవార్డును వెనక్కి తీసుకుంటున్నారు. అవార్డును ఆయనకు ఇవ్వడం లేదంటూ ప్రకటించారు. అయితే, ఈ అవార్డు స్వీకరణ కార్యక్రమం ఉందనే కారణంగానే జానీ మాస్టర్‌కు అక్టోబర్ ఈ నెల 6 నుంచి 9 వరకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆ తరువాత గడువు ముగియడంతో.. మళ్లీ జైలుకు వెళ్లారు. రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేయగా.. తాజాగా హైకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. జానీ మాస్టర్ గురువారం సాయంత్రం చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.


Also Read:

కెనడా ప్రధాని పదవికి ముప్పు

వేగంగా దూసుకొస్తున్న ‘దానా’..

మన ఊర్లో వర్షం 5రోజుల ముందే తెలుసుకోవచ్చు!

For More Telangana News and Telugu News..

Updated Date - Oct 24 , 2024 | 12:49 PM