BJP: బీజేపీ పెద్దలతో భేటీ కానున్న తెలంగాణ నేతలు
ABN, Publish Date - Feb 24 , 2024 | 08:47 AM
నేడు ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు వెళ్లనున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల తదితరులు సాయంత్రం బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో బీజేపీ నేతలు చర్చించనున్నారు. మార్చి రెండో వారంలో అభ్యర్థుల ప్రకటన చేయాలని బీజేపీ భావిస్తోంది. హైకమాండ్ వద్ద ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు పేర్లతో లిస్ట్ రెడీ చేయనున్నారు.
హైదరాబాద్: నేడు ఢిల్లీకి తెలంగాణ బీజేపీ (BJP) నేతలు వెళ్లనున్నారు. కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay), లక్ష్మణ్, డీకే అరుణ (DK Aruna), ఈటల తదితరులు సాయంత్రం బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో బీజేపీ నేతలు చర్చించనున్నారు. మార్చి రెండో వారంలో అభ్యర్థుల ప్రకటన చేయాలని బీజేపీ భావిస్తోంది. హైకమాండ్ వద్ద ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు పేర్లతో లిస్ట్ రెడీ చేయనున్నారు.
సిట్టింగ్‌లు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయంకు మళ్ళీ అవకాశం లభించనుంది. మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి బీజేపీలో తీవ్ర పోటీ నెలకొంది. మల్కాజ్‌గిరి సీటును ఈటల, చాడా సురేష్ రెడ్డి, పన్నాల హరీష్ రెడ్డి, వీరేందర్ గౌడ్, కూన శ్రీశైలం గౌడ్ తదితరులు ఆశిస్తున్నారు. మహబూబ్‌నగర్ స్థానంలో డీకే అరుణ, శాంతికుమార్, జితేందర్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఖమ్మం సీటును పీవీ రమేష్, గల్లా సత్యనారాయణ, రంగా కిరణ్‌లు ఆశిస్తున్నారు. చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వరెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ పోటీ దాదాపు ఖరారు అయ్యారు. బీఆర్ఎస్‌తో పొత్తుపై హైకమాండ్ నుంచి క్లారిటీ తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 24 , 2024 | 09:09 AM