ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: అక్కసుతోనే ఆరోపణలు.. విపక్షాలపై మంత్రి ఆగ్రహం..

ABN, Publish Date - Sep 19 , 2024 | 05:17 PM

విపక్ష పార్టీపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలు తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన..

Minister Ponguleti Srinivas Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 18: విపక్ష పార్టీపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలు తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వం చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలే కాదు.. ఇవ్వని హామీలను కూడా రేవంత్ సర్కార్ నెరవేరుస్తోందన్నారు. విద్య, వైద్యంపై తమ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఉందన్నారు.


మిషన్ భగీరథపై సర్వే చేస్తే 53 శాతం ఇళ్లకు మంచి నీళ్లు రావడం లేదని తేలిందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. రూ. 73 వేల కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించామన్నారు. రూ. 18 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామన్నారు. అర్హులైన రైతులందరికీ రుణ మాఫీ పక్కాగా జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఇరిగేషన్‌లో రూ. లక్ష కోట్లు, మిషన్ భగీరథ పేరుతో రూ. 15 నుంచి 20 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని మంత్రి పొంగులేటి ఆరోపించారు.


బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో ఏమీ చేయలేదని విమర్శించారు. పని చేస్తున్న కాంగ్రెస్‌పై గత పాలకులు బట్టకాల్చి మీద వేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులో గానీ.. వచ్చే నెల మొదటి వారంలో కానీ అర్హులైన వారికి రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. దార్శనికత ఉండాలి కానీ.. అవకాశవాదం ఉండకూడదన్నారు. ఓరుగల్లు అభివృద్ధిని గత పాలకులు పట్టించు కోలేదని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో రూ. 650 కోట్లు విద్య కోసం ఖర్చుచేసి తమ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. 119 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ని కట్టించబోతున్నామని మంత్రి చెప్పారు. 25 ఎకరాలలో ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ని నిర్మిస్తున్నామన్నారు. రూ. 110 కోట్లతో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న వారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి జీర్ణించుకోలేకపోతున్నారని.. అందుకే ప్రతి దాన్ని రాద్దాంతం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. వారి ప్రభుత్వ హయాంలో వారు చేసి చేసిన తప్పులు.. ఇప్పుడూ జరుగుతున్నాయనే భ్రమలో బ్రతుకుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలనుద్దేశించి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎద్దేవా చేశారు.


Also Read:

ఎట్టకేలకు బయటపడ్డ వైసీపీ బండారం..

దసరా సెలవులు ప్రకటించారోచ్..

ఆ పార్టీకి ఇక కష్టమే.. కేకే సంచలన సర్వే..

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 19 , 2024 | 05:17 PM

Advertising
Advertising