Telangana: గేమ్ స్టార్ట్.. కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ కౌంటర్..
ABN, Publish Date - Jul 25 , 2024 | 03:39 PM
Telangana Budget 2024-25: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత, విపక్ష నేత కేసీఆర్ చేసిన కామెంట్స్‌కు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన మంత్రులు, ఎమ్మెల్యేలు..
Telangana Budget 2024-25: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత, విపక్ష నేత కేసీఆర్ చేసిన కామెంట్స్‌కు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. కేసీఆర్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్‌పై స్పందించని కేసీఆర్.. రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి సీతక్క విమర్శించారు. తెలంగాణకు ద్రోహం చేసన కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తే కేసీఆర్ ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడని కేసీఆర్.. రాష్ట్ర బడ్జెట్‌ను విమర్శించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని సీతక్క అన్నారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే అసెంబ్లీకి వచ్చిన మొదటి రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు మంత్రి సీతక్క. బీజేపీ మెప్పు కోసమే కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. 6 నెలల తరువాత అసెంబ్లీ సమావేశాలకు రావడమే ఇందుకు నిదర్శనం అన్నారు.
అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ..
‘ఎన్నడూ లేని విధంగా ఈ రోజు కేసీఆర్ మీడియా పాయింట్‌కి వచ్చారు. తొందర్లోనే కోర్టు బోన్‌లోకి వస్తారు. కేసీఆర్ ఊహల్లో బతికారు. ఇంకా నేనే రాజు అనుకుంటున్నారు. మీరు పెట్టిన బడ్జెట్ ఎవరికి ఉపయోగపడలేదు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ తెచ్చుకుంది. కానీ గత ప్రభుత్వం నీళ్ళు ఇవ్వలేదు.. నిధులూ ఇవ్వలేదు.. ఇంక నియామకాల ఉసే అస్సల్ లేదు. అప్పులు చేసి తెలంగాణ ప్రజల జీవితాలపై వేశారు.’ అని ఎమ్మెల్యే వంశీ కృష్ణ ఫైర్ అయ్యారు.
నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి..
‘వాస్తవానికి బడ్జెట్ దగ్గర ఉంది. అందుకే ప్రతిపక్షానికి మింగుడు పడటం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు గంగలో కలిపారు. లక్ష రూపాయల రుణమాఫీ ఇప్పటికే చేసిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది. ఇప్పటికి పెండింగ్ బిల్లులు రావడం లేదు.’ అని అన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ..
‘గత ప్రభుత్వం మాదిరి అంకెల రూపంలో బడ్జెట్ పెట్టకుండా.. అన్ని శాఖలకు బడ్జెట్ కేటాయించాము. వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్కో రంగానికి ఎన్ని డబ్బులు కేటాయిస్తున్నం అనేది విపులంగా వివరించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు జరగాలని కేటాయింపులు చేయడం జరిగింది. గత బడ్జెట్‌లో కన్నా వైద్య విద్య కోసం ఎక్కువ కేటాయింపులు చేశారు. రూ. 9 వేల కోట్లు పైచిలుకు బడ్జెట్ పెట్టి.. వైద్య విద్యకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. బడ్జెట్‌ను తులనాడే విధంగా కేసీఆర్ మాట్లాడారు. గత బడ్జెట్ పెపర్లకు పరిమితం అయ్యింది. కేసీఆర్ ఇంకా ఊహల్లో ఉండకుండా.. బడ్జెట్‌ను ఆహ్వానించాలి.’ అని అన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే మధన్ మోహన్ రావు..
‘రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమం బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది రైతు బడ్జెట్. తెలంగాణ వచ్చిన పదేళ్లలో నీటిపారుదల ప్రాజెక్టులు అని డబ్బులు తగలేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు.. త్రాగు నీటి సదుపాయాలు లేవు. స్కూల్స్‌లో టీచర్స్ లేరు. వైద్య, విద్య రంగాలకు నిధులు కేటాయింపు చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ కూడా పెట్టడం జరిగింది. సెప్టెంబర్ 5, 6 లోగా గ్లోబల్ మేథోసంపత్తి కోసం స్కిల్ యునివర్సిటీ పెట్టే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్లు తగల వేశారు. కానీ, ఇప్పుడు అన్ని రంగాలకు, సంక్షేమానికి బడ్జెట్‌లో నిధులు పెట్టారు.’ అని అన్నారు.
Also Read:
బడ్జెట్‌పై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నారంటే
రోహిత్, కోహ్లీలకు కొత్త ఫిట్టింగ్.. అదే జరిగితే..
మదనపల్లి కేసులో కీలక అప్డేట్...!
For More Telangana News and Telugu News..
Updated Date - Jul 25 , 2024 | 03:39 PM