ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lok Sabha: నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న తెలంగాణ ఎంపీలు

ABN, Publish Date - Jun 25 , 2024 | 09:08 AM

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు మంగళవారం కొనసాగనున్నాయి. మొదటి రోజు సోమవారం కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకారం జరిగింది. ఈరోజు మరో 281 మంది సభ్యులు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అలాగే తెలంగాణ ఎంపీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు (Parliament Sessions ) రెండో రోజు (Second day) మంగళవారం కొనసాగనున్నాయి. మొదటి రోజు సోమవారం కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకారం జరిగింది. ఈరోజు మరో 281 మంది సభ్యులు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అలాగే తెలంగాణ ఎంపీలు (Telangana MPs) ఇవాళ ప్రమాణ స్వీకారం (Oath taking) చేయనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ప్రమాణస్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) హాజరుకానున్నారు. నిన్న తొలిరోజు 262 మంది ఎంపీలుగా ప్రమాణం చేశారు. ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర మంత్రి మండలి సహా... పలు రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం చేశారు. ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాల వారీగా 262 మందితో ప్రొటెం స్పీకర్ భతృహరి మెహతాబ్ ఎంపీలుగా ప్రమాణం చేయించారు.


కాగా పార్లమెంట్‌ కొత్త భవనంలో 18వ లోక్‌సభ కొలువుదీరింది. ఈ భవనంలో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరగడం ఇదే తొలిసారి. తొలుత ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మెహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. సోమవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ లోపలికి వచ్చేటప్పుడు సభ్యులు నిలబడి కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు.


మోదీ అందరికీ అభివాదం చేస్తూ లోనికి చేరుకున్నారు. ఆ తర్వాత లోక్‌సభ సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు. తొలుత లోక్‌సభ ప్యానెల్‌ చైర్‌పర్సన్లుగా రాధామోహన్‌ సింగ్‌, ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే ప్రమాణం చేశారు. ఉదయం 11.07 నిమిషాలకు నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం జరిగింది.

ఆ తర్వాత వరుసగా రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, మనోహర్‌ లాల్‌, హెచ్‌డీ కుమారస్వామి, పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్రప్రధాన్‌, జితిన్‌ రామ్‌ మాంఝీతోపాటు మిగిలిన కేంద్ర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 12.02 నిమిషాల వరకు కేంద్ర మంత్రులు, ఆ తర్వాత సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.


నేడు 264 మంది ప్రమాణం

లోక్‌సభలో 543 మంది సభ్యులుండగా తొలిరోజు 280 మంది ప్రమాణం చేశారు. మిగతా సభ్యులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 మంది ఎంపీలు మొదటిరోజే ప్రమాణ స్వీకారం చేయగా, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ మినహా.. మిగతా వారు, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌, ఆ పార్టీ కీలక నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరగనుంది. అదేవిధంగా.. కేరళలోని వయనాడ్‌ లోక్‌సభకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు భర్తృహరి మహతాబ్‌ ప్రకటించారు. దీంతో లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ బలం 99కి తగ్గింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పట్టుకున్న పోలీసులు

కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

జగన్‌ రక్షణకు 986 మంది!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 25 , 2024 | 10:09 AM

Advertising
Advertising