ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: తెలంగాణ తల్లి నూతన నమూనాపై సంచలన వ్యాఖ్యలు చేసిన రూపకర్తలు..

ABN, Publish Date - Dec 07 , 2024 | 07:09 PM

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. నూతన విగ్రహ నమూనాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినప్పటి నుంచి వివాదం రాజుకుంది.

హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. నూతన విగ్రహ నమూనాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినప్పటి నుంచి వివాదం రాజుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ తల్లి రూపాన్ని బీఆర్ఎస్ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన రూపం అద్భుతంగా ఉందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన తాజా నమూనా ఏమాత్రం బాగోలేదని అంటున్నారు.


మరోవైపు ఈనెల 9న సచివాలయంలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం శనివారం నాడు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కి వెళ్లి మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. అయితే తెలంగాణ తల్లి నూతన విగ్రహ నమూనాపై వస్తున్న కామెంట్స్‌పై రూపకర్తలు గంగాధర్, రమణారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా వారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు.


ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో తెలంగాణ తల్లి రూపకర్తలు గంగాధర్, రమణారెడ్డి మాట్లాడుతూ.. " తెలంగాణ తల్లి చేయి కాంగ్రెస్ చేయి కాదు.. అభయహస్తం. చేతులు ఉన్న వాళ్లంతా కాంగ్రెస్ వాళ్లా?. సైకిల్ తొక్కుతున్న వాళ్లంతా ఒక పార్టీకి సంబంధించిన వాళ్లా?. తెలంగాణలో అనేక ప్రత్యేక పండగలు ఉన్నాయి. బతుకమ్మతోపాటు బోనాలు, సదర్, సమ్మక్క సారక్క లాంటి అనేక పండగలు తెలంగాణకి ప్రత్యేకమే. తెలంగాణ తల్లి సాధారణ మహిళగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. పోరాట స్ఫూర్తి కనిపించేలా విగ్రహాన్ని తయారు చేయాలని ఆయన సూచించారు. దేవతలు గుడిలో ఉండాలి, తల్లి ఇంట్లో ఉండాలి. తెలంగాణ తల్లి విషయంలో కేసీఆర్, రేవంత్ ఆలోచనలు వేర్వురుగా ఉన్నాయి. తెలంగాణ తల్లి రూపం కోసం అనేక స్కెచ్‌లు తయారు చేశాం. ప్రజలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారనే అర్థం వచ్చేలా విగ్రహాన్ని తయారు చేశాం. తెలంగాణ సమాజమంతా కొత్త తెలంగాణ తల్లి రూపాన్నే ఇష్టపడుతారు" అని చెప్పారు.

Updated Date - Dec 07 , 2024 | 07:09 PM