ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Record Temperature:రికార్డ్ స్థాయిలో ఎండలు.. తస్మాత్ జాగ్రత్త..

ABN, Publish Date - May 31 , 2024 | 09:36 PM

భానుడు వేడితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రజలు రోడ్ల మీదకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

Highest Temperature:

Highest Temperature: భానుడు వేడితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రజలు రోడ్ల మీదకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎండ వేడిమికి తోడు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులను కూడా వాయిదా వేసుకుంటున్నారు. సాయంత్రం 6 దాటిన తర్వాతే ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. నైరుతి రుతుపవనాలు భారత్‌లో ప్రవేశించినా కూడా ఎండ వేడి ఏమాత్రం తగ్గడం లేదు. వడ గాల్పులతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. దీంతో వాతావరణ నిపుణులు హై అలర్ట్ జారీ చేశారు.

54 మంది మృతి..

ఈరోజు అత్యధికంగా పలు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటాయి. మహారాష్ట్రలోని నాగపూర్‌లో అత్యధికంగా 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రికార్డ్ ఉష్ణోగ్రతలతో పాటు తీవ్రస్థాయిలో వీస్తున్న వడగాల్పులకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జక్కుతున్నారు. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో వడదెబ్బతో 54 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క బీహార్‌లోనే 14 మంది మరణించారు. వారిలో 10 మంది ఎన్నికల సిబ్బంది ఉన్నారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్... రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. ఛత్తీస్‌గఢ్, విదర్భ, హిమాచల్ ప్రదేశ్‌లోనూ రికార్డు స్థాయి ఎండ, వేడిగాలులు వీస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తేనే ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని, వాతావరణం చల్లబడుతుందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు.

మొబైల్స్ పేలిపోయే ప్రమాదం

మే 31 నుంచి జూన్ 4 వరకు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 నుంచి 55 డిగ్రీల సెల్సియస్‌ పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. ఎండ వేడి నుంచి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వడగాల్పులతో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.

విపరీతమైన ఎండతో మొబైల్స్ పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మొబైల్ వాడకాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు. పెరుగు, పాలు, పండ్ల రసాలు మొదలైన శీతల పానీయాలను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అధికారులు పలు సూచనలను సూచించారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 47 నుంచి 55 డిగ్రీల సెల్సియస్ మధ్య పెరుగనుందని చెప్పారు. వాతావరణ మార్పులతో చాలా ప్రాంతాల్లో ఎండవేడితో పాటు వడగాల్పులు పెరిగే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు.

పాటించాల్సినవి ఇవే...

కార్ల నుంచి వీటిని తొలగించాలి

1.గ్యాస్ కంటెంట్

2 లైటర్లు

3. కార్బోనేటేడ్ పానీయాలు

4. సాధారణ పెర్ఫ్యూమ్ మరియు ఉపకరణం బ్యాటరీలు

5. కారు కిటికీలు కొద్దిగా తెరిచి ఉండాలి (వెంటిలేషన్)

6. కారు పెట్రోలు, డీజిల్ ట్యాంకులను పూర్తిగా నింపొద్దు

7. సాయంత్రం వేళల్లో మాత్రమే ఇంధనాన్ని నింపుకోవాలి

8.ఉదయం కారులో ప్రయాణాలు శ్రేయస్కారం కాదు

9. ప్రయాణ సమయాల్లో కారు టైర్లను ఓవర్‌ఫిల్ చేయొద్దు.

10. నీటిని అధికంగా తీసుకోవాలి.

11. గ్యాస్ సిలిండర్‌లను సూర్యరశ్మికి గురికాకుండా చూసుకోవాలి.

12. అధికంగా విద్యుత్ వాడకం కూడా ప్రమాదమే. కావునా విద్యుత్‌ను అవసరం మేరకు వినియోగించాలి.

13. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య సూర్యకాంతికి దూరంగా ఉండాలి.

14. విపరీతమైన వేడి సమయంలో మాత్రమే ఎయిర్ కండీషనర్‌లను ఉపయోగించాలి

రెండు-మూడు గంటల తర్వాత, 30 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి. 45-47° ఏసీని 24-25°కి మాత్రమే వినియోగించాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..

చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు టీడీపీ ట్రైనింగ్..

ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..

రాష్ట్ర చిహ్నం.. తాత్కాలికంగా నిలిపివేత..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 31 , 2024 | 09:45 PM

Advertising
Advertising