Group-3 Schedule: తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల.. వివరాలు ఇవే..
ABN, Publish Date - Oct 30 , 2024 | 05:34 PM
తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వెల్లడించింది.
హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వెల్లడించింది. అక్టోబర్ 17న రెండు పేపర్లకు రెండు సెషన్స్ నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ ఫస్ట్ పేపర్ పరీక్షలు జరుగుతాయని, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకూ సెకండ్ పేపర్ పరీక్షలు ఉంటాయని చెప్పింది. అలాగే 18వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకూ పేపర్-3 పరీక్షలు జరుగుతాయని పేర్కొంది.
అభ్యర్థులు నవంబర్ 10 నుంచి హాల్ టికెట్లను తమ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ చూడాలని టీజీపీఎస్సీ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 ఉద్యోగాలకు సంబంధించి 1,388 ఖాళీలు భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు పరీక్షల నిర్వహణ తేదీలను టీజీపీఎస్సీ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణ తేదీలను టీజీపీఎస్సీ తాజాగా ప్రకటించింది. అలాగే మోడల్ ఆన్సర్ బుకెలెట్ షీట్లను సైతం వెబ్‌సైట్‌లో ఉంచినట్లు వెల్లడించింది.
పరీక్షా విధానం ఇదే..
గ్రూప్-3 పరీక్షలో మెుత్తం మూడు పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి. అలా మూడు పేపర్లకు కలిపి 450 మార్కులు ఉంటాయి. నవంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు ఒక్కో పేపర్ రాసేందుకు రెండన్నర గంటల సమయం మాత్రమే ఉంటుంది. ఒక ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మూడు పేపర్లకు 450 మార్కులు ఉంటాయి. ఇక పరీక్షలు మూడు భాషల్లో నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో పరీక్షలు ఉంటాయి. గ్రూప్-3 పోస్టులకు ఎలాంటి ఇంటర్వూ ఉండదు. అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులు కొలువు సాధిస్తారు. మూడు పేపర్లలోనూ జనరల్ నాల్జెడ్, భారత రాజ్యాంగం, భారత చరిత్ర, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, రాష్ట్ర ఏర్పాటు, భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Harsha Sai: హర్ష సాయి కేసులో బిగ్ ట్విస్ట్.. హైకోర్టు కీలక తీర్పు
Save Life: దాతలూ సాయం చేయండి.. ఈ చిన్నారికి ప్రాణం పోయండి..
Updated Date - Oct 30 , 2024 | 06:07 PM