Share News

సింగరేణిలో కారుణ్య నియామకాల వయోపరిమితి 40 ఏళ్లకు పెంపు

ABN , Publish Date - Jun 12 , 2024 | 05:12 AM

సింగరేణిలో కారుణ్య నియామకాల గరిష్ఠ వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. కారుణ్య నియామకాల ఉద్యోగార్థుల వయోపరిమితిని పెంచాలని కార్మికులు దీర్ఘకాలంగా కోరుతుండగా.. ఇటీవలే వారికి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

సింగరేణిలో కారుణ్య నియామకాల వయోపరిమితి 40 ఏళ్లకు పెంపు

హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో కారుణ్య నియామకాల గరిష్ఠ వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. కారుణ్య నియామకాల ఉద్యోగార్థుల వయోపరిమితిని పెంచాలని కార్మికులు దీర్ఘకాలంగా కోరుతుండగా.. ఇటీవలే వారికి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. తాజాగా ఆ నిర్ణయం కార్యరూపం దాల్చింది. ఈ సడలింపు నిర్ణయం 2018 మార్చి 9 నుంచి అమల్లోకి రానుంది. దాంతో ఆ రోజు నుంచి 40 ఏళ్లలోపు ఉన్నవారికి కొలువులు దక్కనున్నాయి. ఈ నిర్ణయంతో 2018 నుంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న దాదాపు 300 మంది వారసులకు తక్షణమే ప్రయోజనం చేకూరనుందని సింగరేణి సీఎండీ ఎన్‌.బలరామ్‌ తెలిపారు.

Updated Date - Jun 12 , 2024 | 06:30 AM