TG High Court: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సుమోటాగా స్వీకరించిన హైకోర్టు
ABN, Publish Date - Jun 03 , 2024 | 10:31 PM
ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారాన్ని సుమోటా పిటిషన్‌గా తెలంగాణ హైకోర్టు స్వీకరించింది. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా హైకోర్టు స్వీకరించింది.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారాన్ని సుమోటా పిటిషన్‌గా తెలంగాణ హైకోర్టు స్వీకరించింది. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా హైకోర్టు స్వీకరించింది. ఎస్ఐబి మాజీ హూ ఇస్ ది ప్రభాకర్ రావు, భుజంగరావు, ప్రణీతరావు, తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడానికి పలువురు రాజకీయనేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు భుజంగరావు వాంగ్మూలం ఇచ్చారని పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ సైతం టాప్ చేసినట్లు భుజంగరావు వెల్లడించినట్లు పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ కథనాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలోక అరాదే ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. మంగళవారం మధ్యాహ్నం ఈ పిటిషన్‌ను సీజే ధర్మాసనం విచారించనున్నది.
పోలీసు శాఖతో పాటు రాజకీయపరంగా కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తును ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రణీత్ రావు ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం బహిర్గతమవుతోంది. ఎస్‌ఐబి కార్యాలయంతో పాటు ఇతర ప్రైవేటు ప్రదేశాల్లోనూ ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రధాన ఆరోపణలు వినిపిస్తుండగా, పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మాజీ టా స్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, సీఐ గట్టు మల్లును పోలీసులు విచారించిన విషయం తెలిసిందే.
Updated Date - Jun 03 , 2024 | 10:36 PM