ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు..

ABN, Publish Date - Dec 13 , 2024 | 03:29 PM

సినీ నటుడు మంచు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఓ మీడియా ప్రతినిధిపై దాడి కేసులో రాచకొండ పోలీసులు తనపై నమోదు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ వేశారు.

హైదరాబాద్: సినీ నటుడు మంచు మోహన్ బాబు (Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు (High Court)లో చుక్కెదురు అయ్యింది. ఓ మీడియా ప్రతినిధిపై దాడి కేసులో రాచకొండ పోలీసులు తనపై నమోదు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ (శుక్రవారం) విచారణ జరిపిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.


కాగా, మంచు ఫ్యామిలీ వివాదాల నేపథ్యంలో గత ఆదివారం నుంచి మూడ్రోజులపాటు హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. తనపై దాడి జరిగిందంటూ పోలీసులను మనోజ్ ఆశ్రయించగా, కుమారుడు మనోజ్ అతని భార్యతో తనకు హాని ఉందని రాచకొండ పోలీసులకు మోహన్ బాబు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో తండ్రికొడుకులపై కేసులు అయ్యాయి. అయితే మంచు ఫ్యామిలీ ఘర్షణల నేపథ్యంలో ప్రశ్నించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ విలేకరి చెవి ఎముక మూడు చోట్ల విరిగింది. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్‌గా మారింది.


ఈ దాడిపై ఆ వార్తా సంస్థ యాజమాన్యం రాచకొండ పోలీసులను ఆశ్రయించింది. వారి ఫిర్యాదు మేరకు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. అయితే విచారణకు రావాలంటూ ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా, మూడ్రోజులపాటు జరిగిన తీవ్ర ఘర్షణలతో ఆయన అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ సమయంలోనే తనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంపై హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. కాగా, నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం మోహన్ బాబు పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలురించింది.

Updated Date - Dec 13 , 2024 | 04:02 PM