ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..

ABN, Publish Date - Sep 16 , 2024 | 09:44 AM

శనివారం అర్ధరాత్రి నుంచి ట్యాంక్ బండ్‌పై నిమజ్జనాలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇవ్వడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఖైరతాబాద్, లకిడికాపూల్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా భారీగా వాహనాలు దర్శనమిస్తున్నాయి.

హైదరాబాద్: శనివారం అర్ధరాత్రి నుంచి ట్యాంక్ బండ్‌పై నిమజ్జనాలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇవ్వడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఖైరతాబాద్, లకిడికాపూల్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా భారీగా వాహనాలు దర్శనమిస్తున్నాయి. 9వ రోజు కావడంతో నిమజ్జనం చేసేందుకు విగ్రహాలను పెద్దఎత్తున తీసుకువస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల నుంచి వెళ్లేందుకు గంటల తరబడి సమయం పడుతోంది. అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లింపు చర్యలు చేపట్టారు.


మరోవైపు గణేశ్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు చేసింది. సుమారు 80ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు నిమజ్జన ఏర్పాట్ల చేశారు. 140స్టాటిక్ క్రేన్లు, 295మొబైల్ క్రేన్లు, 125జేసీబీలు, 102మినీ టిప్పర్లను సిద్ధం చేశారు. నిమజ్జన డ్యూటీలో 20వేల మందికి పైగా జీహెచ్ఎంసీ సిబ్బంది పని చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 31క్రేన్లు ఏర్పాటు చేశారు. అలాగే ట్యాంక్ బండ్‌పై 7, ఎన్టీఆర్ మార్గ్‌లో 9, పీపుల్స్ ప్లాజా వద్ద 7, జలవిహార్ వద్ద 4 క్రేన్లు సిద్ధం చేశారు. అయితే హుస్సేన్ సాగర్ చుట్టూ సరిపడా క్రేన్లు లేకపోవడంతో నిమజ్జనం ఆలస్యం అవుతోంది. దీంతో పెద్దఎత్తున గణనాథులు బారులు తీరి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఈనెల 17, 18తేదీల్లోనూ భారీగా నిమజ్జనాలు ఉండడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూట్ మ్యాప్ విడుదల చేశారు. గణేశ్ నిమజ్జన ఊరేగింపు, ట్రాఫిక్ నిబంధనలు, పార్కింగ్ స్థలాలు, ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల రూట్ ఎంట్రీపై ఆంక్షలు విధించారు. అలాగే భారీ, అతి భారీ వాహనాలకు అనుమతి నిరాకరించారు. వాహనదారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Ganesh immersion: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలకు రూట్ మ్యాప్ విడుదల

Vikarabad: వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత.. చివరికి ఏం జరిగిందంటే..

Updated Date - Sep 16 , 2024 | 10:26 AM

Advertising
Advertising