ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bangalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్..

ABN, Publish Date - Jun 03 , 2024 | 04:38 PM

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్ నటి హేమను బెంగళూరు పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. సోమవారం నాలుగు గంటల సమయంలో హైదరాబాద్‌కు వచ్చిన బెంగళూరు సీసీబీ పోలీసులు హేమను అదుపులోనికి తీసుకోవడం జరిగింది..

హేమకు కస్టడీ

  • బెంగళూరు డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం

  • రేవ్‌ పార్టీ కేసులో ఈనెల 14 వరకు...

  • నటి హేమకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన జడ్జి

  • రేవ్‌ పార్టీ నిర్వహణలో హేమదే కీలక పాత్ర: పోలీసులు


అరెస్ట్..

  • బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్

  • బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన పోలీసులు

  • తొలుత హేమను విచారించిన పోలీసులు

  • విచారణ అనంతరం హేమను అరెస్ట్‌ చేసిన పోలీసులు

  • హేమను అరెస్టు చేసిన బెంగళూరు సీసీబీ

  • బురఖా ధరించి సీసీబీకి వచ్చిన నటి హేమ

  • మెడికల్ పరీక్షల కోసం హేమను..

  • ఆస్పత్రికి తరలించిన బెంగళూరు పోలీసులు

  • కేసీ నజ్రల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించేందుకు ఏర్పాట్లు

  • రేపు ఉదయం అనేకల్‌లోని కోర్టులో హాజరుపరచనున్న సీసీబీ


సాయంత్రం 4:30 గంటల సమయంలో ఇలా..!

హైదరాబాద్/బెంగళూరు: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్ నటి హేమను బెంగళూరు పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. సోమవారం నాలుగు గంటల సమయంలో హైదరాబాద్‌కు వచ్చిన బెంగళూరు సీసీబీ పోలీసులు హేమను అదుపులోనికి తీసుకోవడం జరిగింది. అయితే హేమను అరెస్ట్ చేశారు. మరోవైపు.. మంగళవారం నాడు ఆమెను కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. గత నెల 20న బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో హేమ పాల్గొన్న సంగతి తెలిసిందే.


ఏం జరిగింది..?

అయితే.. అబ్బే తాను పాల్గొనలేదని, అదంతా ఫేక్ అని నానా రచ్చ చేసింది. ఆ తర్వాత ఫొటోలతో సహా పోలీసులు రిలీజ్ చేయడంతో కంగుతిన్న హేమ.. ఎట్టకేలకు ఒప్పేసుకుంది. ఈ క్రమంలోనే పార్టీకి హాజరైన అందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయడం.. ఇందులో హేమతో పాటు మొత్తం 86 మందికి, అందులోనూ తెలుగు వారందరికీ పాజిటివ్ వచ్చింది. అప్పడిక రంగంలోకి దిగిన పోలీసులు పాజిటివ్ వచ్చిన వారందరికీ నోటీసులు ఇవ్వడం.. విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఆ సమయంలో తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని.. విచారణకు హాజరుకాలేనని కొద్దిరోజులు సయం కావాలని హేమ అడిగింది. సమయం ఇచ్చినప్పటికీ విచారణకు రాకపోవడంతో బెంగళూరు నుంచి వచ్చి అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jun 03 , 2024 | 10:12 PM

Advertising
Advertising