Congress: వికారాబాద్ దాడిలో మొదటి ముద్దాయి కేటీఆర్: టీపీసీసీ చీఫ్
ABN, Publish Date - Nov 14 , 2024 | 01:11 PM
కలెక్టర్‌పై దాడి చేసినవారు ఎవరైనాసరే వదిలేది లేదని.. 90 శాతం మంది రైతులు ఫార్మా కంపెనీ కోసం అంగీకరిస్తే.. సంబంధం లేని వ్యక్తులు దాడి చేశారని, ఇది కుట్రలో భాగంగానే దాడి జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజకీయాల కోసం కేటీఆర్ చిల్ల వేషాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) కేటీఆర్ (KTR) పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడిలో మొదటి ముద్దాయి కేటీఆర్ అని ఆరోపించారు. ఆయన శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. కలెక్టర్‌పై దాడి చేసినవారు ఎవరైనాసరే వదిలేది లేదని.. 90 శాతం మంది రైతులు ఫార్మా కంపెనీ కోసం అంగీకరిస్తే.. సంబంధం లేని వ్యక్తులు దాడి చేశారని, ఇది కుట్రలో భాగంగానే దాడి జరిగిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజకీయాల కోసం కేటీఆర్ చిల్ల వేషాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం గాంధీ భవన్‌నలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ. ఈ ఫార్ములా విషయంలో కేటీఆర్ డబ్బులు నొక్కేసారని, ప్రభుత్వ డబ్బులను కాజేసినా ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ఎవరి జాగీరు అని డబ్బులు ఇష్ట రాజ్యంగా ఇచ్చారన్నారు. కేటీఆర్ నుంచి కాల్ వెళ్ళగానే పట్నం నరేందర్ రెడ్డి తన కార్యకర్తలతో దాడి చేయించారని, మొన్నటి వరకు మూసీ, హైడ్రా విషయంలో అబద్ధాలు ప్రచారం చేసారని.. ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
రైతులు కానీ వాళ్ళు, భూములు లేని వాళ్ళకి దాడి చేయాల్సిన అవసరం ఏముందని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. అధికారులపై దాడులు చేయడం ఏంటన్నారు. అధికారులపై దాడి చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని, అభివృద్ధి ఆగిపోతే తరతరాలు బాధపడాల్సి వస్తుందన్నారు. ముఖ్యమంత్రికి భేషజాలు లేవన్నారు. డిసెంబర్ 2 లేదా 3 న కాంగ్రెస్ బహిరంగ సభ జరుగుతుందని, ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అవుతున్న సందర్భంలో పలు కార్యక్రమాలు చేయాలని కాంగ్రెస్ భావిస్తుందన్నారు. శుక్రవారం నుండి కార్యక్రమాలు చేయాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేలా హస్తం నేతలు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అది జగన్ విధ్వంసానికి పరాకాష్ట
నాకు అంత స్ధాయిలేదు లోకేష్ అన్నా..: శ్రీరెడ్డి
వైసీపీ సర్పంచ్ హుసేని ఇద్దరు కార్యకర్తల అరెస్టు..
అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం...
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 14 , 2024 | 01:11 PM