ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: కేటీఆర్ ట్వీట్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్..

ABN, Publish Date - Oct 19 , 2024 | 12:15 PM

తెలంగాణ ముఖ్యమంత్రి పదవి, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై తాను చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ట్వీట్ చేయడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR)కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి పదవి, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై తాను చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ట్వీట్ చేయడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీని కాపాడేందుకు బండి సంజయ్ తాపత్రయ పడుతున్నారని, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా? లేక బీజేపీ అనుబంధ ప్రభుత్వమా? అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్‌గా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్‌పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.


డబ్బు సంచులు మోశారు..

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. " కేటీఆర్ అరవకు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నువ్వు, మీ నాన్న కేసీఆర్ దోషులు. ఎందుకు మిమల్ని సీఎం రేవంత్ రెడ్డి అరెస్టు చేయడం లేదు. తండ్రికొడుకులు ఇద్దరూ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దల కాళ్లు పట్టుకుంది నిజం కాదా?. రేవంత్ రెడ్డి.. నీకు దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి. మేము కూడా కేంద్రం తరుఫున సీబీఐని రిక్వెస్ట్ చేస్తాం. అప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని బయటపడుతుంది. హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికలకు కాంగ్రెస్ ఖర్చు చేసిన డబ్బు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినదే. కేటీఆర్ అహంకారమే ఆ పార్టీని ఈ దుస్థితికి తెచ్చింది. నీ అహంకారపూరిత మాటల వల్లే మీ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయింది. ఇప్పుడు మళ్లీ అదే రకంగా మాట్లాడుతున్నావు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి కానే కాదు. దోస్తులమైతే ఫోన్లలో మాట్లాడుకుంటాం. మీడియాకు స్టేట్మెంట్లు ఇవ్వం. అసలు దోస్తానా కేసీఆర్, కాంగ్రెస్ కే ఉంది.


ఎందుకు ఇవ్వడం లేదు..

హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డబ్బు సహాయం చేసింది కేసీఆరే. డబ్బు సంచులతో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలకు ఇచ్చింది వాస్తవం కాదా?. మీ రెండు పార్టీల మధ్య స్నేహ సంబంధాలు లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఎందుకు ముందుకు సాగడం లేదు. ఈ కేసులో కేసీఆర్ ఆదేశాల మేరకే అధికారులు ట్యాపింగ్ చేసినట్లు క్లియర్‌గా రిపోర్టు ఉంది. ఈ రిపోర్టు ప్రకారం కనీసం ఆయనకు 41సీఆర్పీసీ నోటీసూ ఎందుకు ఇవ్వడం లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని. మీ మధ్యలో స్నేహం లేకపోతే కేసును సీబీఐకి అప్పగించండి. సీబీఐ ద్వారా విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకు వస్తాయి" అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

KTR: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను టార్గెట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్..

Hyderabad: గబ్బు రేపుతున్న హైదరాబాద్ పబ్బులు..

TG News: ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తే..

Updated Date - Oct 19 , 2024 | 12:27 PM