ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Prashant Reddy: అలా చేయడం లీడర్ ఆఫ్ అపోజిషన్‌ను అవమానించడమే

ABN, First Publish Date - 2024-02-08T14:42:35+05:30

Telangana: అసెంబ్లీలో ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్‌కు చిన్న ఛాంబర్ ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: అసెంబ్లీలో ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్‌ఎస్ నేతలు (BRS Leaders) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్‌కు చిన్న ఛాంబర్ ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Former Minister Vemula Prashant Reddy)మాట్లాడుతూ.. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన 39 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి స్పీకర్‌ను కలిశామని.. అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్‌కు చిన్న ఛాంబర్ ఇవ్వడం అవమానించడమే అని అన్నారు. ‘‘స్పీకర్ కావాలని అడగడంతో ఎల్‌వోపీ ఇచ్చాం. స్పీకర్ మీద గౌరవంతో ఇవ్వడం జరిగింది. మా ఎల్‌వోపీకి అంతే పెద్ద ఛాంబర్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ చిన్న గదిని కేటాయించారు అది కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు వాడుతున్న ఎల్‌వోపీ రూమ్‌ను మీ సౌకర్యం కోసం ఇవ్వడానికి ఒప్పుకున్నారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఐదుగురు ఉన్నప్పుడు కూడా మేము ఎల్‌వోపీ రూమ్ ఇచ్చాం. పెద్ద ఛాంబర్ కేటాయించాలని స్పీకర్‌ను కోరాము’’ అని తెలిపారు.


ఓడిపోయిన వారికి ప్రోటోకాలా?...

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. సంగారెడ్డి లో చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే అనే విషయం మర్చిపోతున్నారన్నారు. సంగారెడ్డిలో ఓడిపోయిన ఎమ్మెల్యే భార్యకు ప్రోటోకాల్ ఇస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఆర్డీవో కూడా అలానే చేస్తున్నారన్నారు. దీంతో ఆర్డీవోపై పిర్యాదు చేశామని చెప్పారు. ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పోలీస్ ఎస్కార్ట్ వెహికల్ ఇస్తున్నారన్నారు. దీనిపై డీజీపీ ఆలోచించాలని కోరారు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, ముఖ్యమంత్రులు, వస్తారు పోతారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. .

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - 2024-02-08T14:42:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising