ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijaya Dairy : టీటీడీకి పాల ఉత్పత్తులు అందించేందుకు రెడీ: సబ్యసాచి ఘోష్

ABN, Publish Date - Sep 21 , 2024 | 06:11 PM

తిరుపతిలో లడ్డూ వివాదంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు స్పందిస్తున్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్ స్పందించారు. టీటీడీకి విజయ డైరీ నుంచి పాల ఉత్పత్తులు అందజేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

హైదరాబాద్: టీటీడీకి పాల ఉత్పత్తులు అందజేయడానికి తెలంగాణ విజయ డైరీ సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్ తెలిపారు. తెలంగాణ పశుసంవర్థక శాఖకు చెందిన విజయ డైరీ సంస్థ (TGDDFCL) తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి సమర్పించే నైవేద్యాల కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు సబ్యసాచి ఘోష్ టీటీడీ కార్యనిర్వహణ అధికారి జె.శ్యామలరావుకు శనివారం లేఖ ద్వారా ప్రభుత్వ ప్రతిపాదనను తెలిపారు.


Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..

దేశవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల రంగంలో తెలంగాణ విజయ డైరీ సంస్థ ప్రసిద్ధి చెందిందని గుర్తుచేశారు. వినియోగదారులకు విలువైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేసిన చరిత్రను కలిగి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు విజయ డైరీ ఉత్పత్తుల్లో నాణ్యతను నిర్ధారించడంతో పాటు, లక్షలాది మంది పాల రైతుల జీవనోపాధికి సంస్థ తోడ్పడుతుందని సబ్యసాచి ఘోష్ తెలిపారు.


ALSO Read: KTR: సీఎం రేవంత్ భారీ కుంభకోణం.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిక నాణ్యత గల నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల అవసరాలన్నింటినీ తీర్చడానికి విజయ డైరీ సంస్థ సన్నద్ధంగా ఉందని అన్నారు. విజయ డైరీ ప్రభుత్వ సంస్థ అవడంతో సరఫరాల స్వచ్ఛత, నాణ్యత, ధరల విషయంలో పూర్తి పారదర్శకంగా ఉంటుందని సబ్యసాచి ఘోష్ తెలిపారు. దేవస్థానానికి, భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్ టీటీడీ కార్యనిర్వహణ అధికారి జె.శ్యామలరావుకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Prashanth Reddy: పీఏసీ నియామకంలో కూడా రాజకీయాలా..

KTR: ఏచూరీ సంస్మరణ సభలో కేటీఆర్ హాట్ కామెంట్స్..

Sridhar Babu: సేమీ కండక్టర్ల రంగంలో ఉపాధి అవకాశాలు..

KTR: ఏచూరీ సంస్మరణ సభలో కేటీఆర్ హాట్ కామెంట్స్..

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 21 , 2024 | 06:22 PM