ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: ప్రియురాలితో సరసాలు.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన భార్య.. నెక్ట్స్ ఏం జరిగిందంటే..

ABN, Publish Date - Jun 15 , 2024 | 12:58 PM

మాజీ మిస్ వైజాగ్ ఘటన మరవక ముందే హైదరాబాదులో అచ్చం అలాంటి ఘటనే రిపీట్ అయ్యింది. నగరంలోని అంబర్‌పేట్ డీడీ కాలనీలో మరో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. ప్రియురాలితో భర్త ఎంజాయ్ చేస్తుండగా.. భార్య, పిల్లలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Wife Caught Husband

హైదరాబాద్, జూన్ 15: మాజీ మిస్ వైజాగ్ ఘటన మరవక ముందే హైదరాబాదులో అచ్చం అలాంటి ఘటనే రిపీట్ అయ్యింది. నగరంలోని అంబర్‌పేట్ డీడీ కాలనీలో మరో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. ప్రియురాలితో భర్త ఎంజాయ్ చేస్తుండగా.. భార్య, పిల్లలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో అక్కడ పెద్ద గొడవ జరిగింది. ప్రవీణ్ భార్య, పిల్లలు అతని ప్రేయసిని బయటకు లాక్కొచ్చేందుకు ప్రయత్నించగా.. ప్రవీణ్ వారిపై దాడి చేశాడు. దీంతో వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.


ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముషీరాబాద్ ఎస్ఆర్టీ కాలనీ చెందిన ప్రవీణ్‌కు కొన్నేళ్ల క్రితమే పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, ప్రవీణ్ పని చేసే చోట ఓ మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ అంబర్‌పేట్ డీడీ కాలనీలో నివాసం ఉంటుంది. ఆ మహిళకు ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, ప్రవీణ్ ఆమెతో అఫైర్ పెట్టుకుని.. భార్య, పిల్లలను పట్టించుకోవడం మానేశాడు. దీంతో భర్త రహస్యాన్ని ఎలాగైనా బయటపెట్టాని నిర్ణయించుకున్న భార్య, పిల్లలు.. శనివారం నాడు డీడీ కాలనీలో ప్రవీణ్, అతని ప్రేయసి ఏకాంతంగా ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ‘నా భర్తతో ఎలా ఉంటావు’ అంటూ ప్రవీణ్ ప్రేయసికి దేహశుద్ధి చేశారు అతని భార్య, పిల్లలు. దీంతో ప్రియురాలిని రక్షించి.. భార్యను, పిల్లలను తీవ్రంగా కొట్టాడు ప్రవీణ్.


ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రవీణ్ కొన్ని నెలలుగా తన ప్రియురాలితో అంబర్‌పేట్‌లోని డీడీ కాలనీలో సహజీవనం చేస్తున్నాడని.. అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ప్రవీణ్ భార్య ఆదేవన వ్యక్తం చేసింది. భర్త చేష్టలను బయటపెట్టాలని ఇవాళ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని భార్య, కుమారులు తెలిపారు.

ప్రవీణ్ ప్రేయసికి ముందే వివాహమైందని.. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెబుతున్నారు. భర్త ప్రవీణ్ దాడి చేయడంతో అతని భార్య, పిల్లలు అంబర్‌పేట్ పోలీసులను ఆశ్రయించారు. తను పనిచేస్తున్న సంస్థలోనే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. తమకు న్యాయం చేయాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రవీణ్, అతని ప్రేయసిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

For More Telangana News and Telugu News..

Updated Date - Jun 15 , 2024 | 12:58 PM

Advertising
Advertising