Zomato: జొమాటో డెలివరీ బాయ్ దారుణం.. గూగుల్ పే నుంచి యువతి నంబర్ పట్టి..
ABN, Publish Date - Mar 30 , 2024 | 10:05 AM
జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ అఘాయిత్యం తాజాగా హైదరాబాద్‌లో వెలుగు చూసింది. యువతిపై ఫుడ్ డెలివరీ బాయ్ అత్యాచారం చేసిన ఘటన జూబ్లీ హిల్స్‌లో చోటు చేసుకుంది.
హైదరాబాద్: జొమాటో (Zomato) ఫుడ్ డెలివరీ బాయ్ (Food Delivery Boy) అఘాయిత్యం తాజాగా హైదరాబాద్ (Hyderabd)లో వెలుగు చూసింది. యువతిపై ఫుడ్ డెలివరీ బాయ్ అత్యాచారం చేసిన ఘటన జూబ్లీ హిల్స్ (Jubleehills)లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. మల్లేపల్లికి చెందిన ఒబేదుల్లాఖాన్ (23) అనే ఫుడ్ డెలివరీ బాయ్.. ఎనిమిది నెలల క్రితం లక్షీకాపూల్‌లో ఓ సెమినార్‌కు హాజరైన ప్రైవేటు ఉద్యోగికి (22) ఫుడ్ డెలివరీ చేశాడు. ఆర్డర్ అందుకున్న సదరు యువతి గూగుల్ పే (Google Pay) నుంచి అతనికి పేమెంట్ చేసింది.
Congress: నేడు కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ కీలక నేతలు..
ఆ నంబర్‌ని పట్టుకుని తరచూ ఆమెకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఒబేదుల్లాఖాన్ పరిచయం పెంచుకున్నాడు. సదరు యువతి కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటోంది. క్రమక్రమంగా ఆమెతో ఒబేదుల్లాఖాన్ సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే డిన్నర్ (Dinner)కి వెళదాం రమ్మని సదరు యువతిని పిలిచాడు. ఆపై మాట్లాడే పని ఉందని ఓయో రూమ్ (Oyo Room)కి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. రాత్రి ఒంటి గంట తర్వాత తాను నిద్రమత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. యువతి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఐపీసీ 376, 354, 354 (2), 4, 376, 66 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Bharat Ratna 2024: నేడు భారతరత్నలు ప్రదానం.. పీవీ తరపున అందుకోనున్న కుమారుడు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Mar 30 , 2024 | 10:13 AM