Hydra: హైడ్రా ఏ నిర్ణయం తీసుకోబోతోంది.. క్షణం క్షణం ఉత్కంఠ..
ABN, Publish Date - Nov 22 , 2024 | 03:08 PM
నగరంలో చెరువులు, కుంటలు, నాళాలు ఆక్రమించిన నిర్మాణాలు చేపట్టిన ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది హైడ్రా. ఏ క్షణం ఎక్కడ వాలిపోతుందో.. ఎవరి ఇల్లు కూలగొడుతుందోననే భయాందోళనతో ఉన్నారు.
హైదరాబాద్, నవంబర్ 22: నగరంలో చెరువులు, కుంటలు, నాళాలు ఆక్రమించిన నిర్మాణాలు చేపట్టిన ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది హైడ్రా. ఏ క్షణం ఎక్కడ వాలిపోతుందో.. ఎవరి ఇల్లు కూలగొడుతుందోననే భయాందోళనతో ఉన్నారు. మరోవైపు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దూకుడు అక్రమార్కులను మరింత భయపెట్టిస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన హైడ్రా.. మరింత దూకుడు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగుతోంది. ఈ సమావేశంలో కీలక అధికారులతో పాటు.. మేధావులు సైతం పాల్గొన్నారు. ఆక్రమణల తొలగింపు అంశంపై వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తున్నారు.
3 గంటలుగా సమావేశం..
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సమావేశం 3 గంటలుగా కొనసాగుతూనే ఉంది. ఈ సమావేశంలో ఇప్పటికే తొలగించిన ఆక్రమణలు.. ప్రజల నుంచి వస్తున్న స్పందన.. మిగతా ఆక్రమణల గుర్తింపు, తొలగింపు అంశంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. సమావేశంలో పాల్గొన్న మేధావుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.
కీలక ప్రకటన రాబోతుందా..
తొలుత దూకుడు ప్రదర్శించిన హైడ్రా.. క్రమ క్రమంగా వెనక్కి తగ్గుతూ వస్తోంది. మధ్య మధ్యలో ఒకటి రెండు అక్రమ కట్టడాలను కూల్చివేసినా.. అంత స్పీడ్ ఉండటం లేదు. ఇందుకు కారణం ప్రజా వ్యతిరేకతే. హైడ్రా ఏర్పాటైన తొలి రోజుల్లో చిన్నా, పెద్ద అనే తారతమ్యం లేకుండా అక్రమంగా నిర్మించిన వారి కట్టడాలన్నీ కూల్చిపడేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు ఉన్నాయని గుర్తించిన హైడ్రా.. వాటిని కూల్చివేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి అధునాతన యంత్రాలను సైతం తెప్పించారు. దీంతో కూల్చివేతలు మరింత పెరిగే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ, ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో హైడ్రా కాస్త సైలెంట్ అయ్యింది. కానీ, ఇప్పుడు మళ్లీ దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే.. శుక్రవారం కీలక భేటీ నిర్వహించింది హైడ్రా. ఈ మీటింగ్ తరువాత కీలక ప్రకటన ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏం చెబుతారనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.
Also Read:
హైడ్రా చేతికి సరికొత్త అధికారాలు
నిజ్జర్ హత్య కుట్రలో మోదీ ప్రమేయంపై కెనడా యూటర్న్
లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు.. ఊపిరి పీల్చుకుంటున్న మదుపరులు..
For More Telangana News and Telugu News..
Updated Date - Nov 22 , 2024 | 03:08 PM