HYDRA: కూల్చివేతల వ్యర్థాలు తరలించేందుకు ‘హైడ్రా’ యత్నం
ABN, Publish Date - Nov 12 , 2024 | 10:29 AM
హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్‌పూర్(Aminpur) మున్సిపాలిటీలో సోమవారం హైడ్రా సిబ్బంది పర్యటించడంతో అలజడి రేగింది. గతంలో మున్సిపల్ పరిధిలోని పటేల్‌గూడ(Patelguda)లో రెవెన్యూ, హైడ్రా బృందాలు సంయుక్తంగా 28 ఇళ్లను కూల్చివేసిన విషయం తెలిసిందే.
- ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల పరిశీలన
పటాన్‌చెరు(సంగారెడ్డి): హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్‌పూర్(Aminpur) మున్సిపాలిటీలో సోమవారం హైడ్రా సిబ్బంది పర్యటించడంతో అలజడి రేగింది. గతంలో మున్సిపల్ పరిధిలోని పటేల్‌గూడ(Patelguda)లో రెవెన్యూ, హైడ్రా బృందాలు సంయుక్తంగా 28 ఇళ్లను కూల్చివేసిన విషయం తెలిసిందే. కాగా కూల్చివేసిన వ్యర్థాలను తొలగించేందుకు హైడ్రా సిబ్బంది ఎక్సకవేటర్లతో ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇళ్ల వద్దకు చేరుకున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: దేవుడా.. ఎంతపని చూశావయ్యా.. గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటుతో..
విషయం తెలుసుకున్న బాధితులు హైకోర్టు స్టే ఉత్తర్వులు చూపడంతో సిబ్బంది వెనుదిరిగారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని 343 ప్రభు త్వ సర్వే నంబర్లలో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది పరిశీలించారు. బంకొమ్ము చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలోని కట్టడాలను పరిశీలించారు. గతంలో మండల పరిధిలోని ప్రభుత్వ సర్వే నంబర్లలో పెద్దఎత్తున ఆక్రమణలు చోటు చేసుకున్నాయని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సమగ్ర సర్వే కు హైడ్రా కమిషనర్ రంగనాథ్(Commissioner Ranganath) ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ భూములు పెద్దఎత్తున విస్తరించి ఉన్న 993, 630 సర్వే నంబర్లలో ఆక్రమణలను ఇప్పటికే గుర్తించిన తహసీల్దార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్, హైడ్రాకు సమగ్ర నివేదిక సమర్పించారు. సర్వేలో తేలిన సుమారు 700ల పైచిలుకు అక్రమ కట్టడాలకు నోటీసులు సైతం జారీ చేశారు. అమీన్‌పూర్ పెద్ద చెరువుతో పాటు, శంభునికుంట, సంభిచెరువు, శెట్టికుంటల్లోని ఆక్రమణలను సైతం గుర్తించారు. చాలా రోజుల విరామం తరువాత తిరిగి హైడ్రా సిబ్బంది మండల పరిధిలో పర్యటించడంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. త్వరలోనే ఆక్రమణలను తొలగించే కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు... ఏం జరిగిందంటే..
ఈవార్తను కూడా చదవండి: IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: TG News: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...
ఈవార్తను కూడా చదవండి: Khammam: బోనకల్‌లో యాచకుడికి ఐపీ నోటీసు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 12 , 2024 | 10:30 AM