ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

illegal Rice Transport: ఏపీ నుంచి సన్నాల అక్రమ రవాణా

ABN, Publish Date - Dec 16 , 2024 | 04:14 AM

ఏపీ నుంచి తెలంగాణలోకి సన్న ధాన్యం అక్రమ రవాణా అవుతోంది. సన్నాలకు క్వింటాకు రూ.500 చొప్పున రాష్ట్ర సర్కారు బోనస్‌ ఇస్తుండటంతో దళారులు, వ్యాపారులు నకిలీ పత్రాలు సృష్టించి అడ్డదారుల్లో రాష్ట్రంలోకి తరలిస్తున్నారు.

  • రూ.500 బోనస్‌ ఇస్తుండటంతో తరలింపు

  • కృష్ణా, గుంటూరులో కొనుగోలు

  • 91 లారీల్లో ఖమ్మం జిల్లాలోని పలు మండలాలకు..

  • 31 లారీలు వెనక్కి.. మరో 60 లారీలకు సెస్‌తో ఓకే

  • రేషన్‌ బియ్యం ఇతర రాష్ట్రాలకు.. రైళ్లలో రవాణా

ఖమ్మం/ముదిగొండ, నేలకొండపల్లి, మేడ్చల్‌, డిసెంబరు15(ఆంధ్రజ్యోతి): ఏపీ నుంచి తెలంగాణలోకి సన్న ధాన్యం అక్రమ రవాణా అవుతోంది. సన్నాలకు క్వింటాకు రూ.500 చొప్పున రాష్ట్ర సర్కారు బోనస్‌ ఇస్తుండటంతో దళారులు, వ్యాపారులు నకిలీ పత్రాలు సృష్టించి అడ్డదారుల్లో రాష్ట్రంలోకి తరలిస్తున్నారు. ఏపీలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సన్నధాన్యాన్ని కొనుగోలు చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రైస్‌మిల్లుల పేరుతో ఫారం-10 ద్వారా ఏకంగా 91లారీల ధాన్యం ఖమ్మం జిల్లాలోని ముదిగొండ, నేలకొండపల్లి మండలాల కోసం తరలించేయత్నం చేశారు. వీటిలో 31 లారీలను పౌరసరఫరాలశాఖ అధికారులు సరిహద్దు ప్రాంతాల్లోనే అడ్డుకొని, రాష్ట్రంలోకి అనుమతి లేదని తప్పి పంపారు. అయితే ఆ అధికారులు రాకముందే.. మరో 60 లారీలు ముదిగొండ మండలంలోకి ప్రవేశించాయి. అక్కడ.. వల్లభి మార్కెటింగ్‌ చెక్‌పోస్టు వద్ద లారీకి రూ.5,800 చొప్పున మార్కెటింగ్‌ సెస్‌ను రాసి అనుమతించారు.


ఆ లారీలు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వెళుతుండగా నేలకొండపల్లి మండలం చెరువుమాధారం వద్ద కొందరు రైతులు అడ్డుకున్నారు. అక్రమంగా ధాన్యం తరలిస్తున్నట్లు అనుమానంతో 20లారీలను పోలీసులకు అప్పగించారు. దాంతో పోలీసులు అనుమతి లేకుండా వచ్చినందుకు లారీకి రూ.3వేల చొప్పున జరిమానా విధించి లారీలను వదిలేశారు. వాస్తవానికి విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ ఉన్నా లారీలు అటువైపుగా వెళ్లకుండా ఖమ్మం జిల్లా ముదిగొండ, నేలకొంపడ పల్లి మండలాల మీదుగా కోదాడ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, ప్రాంతాలకు వెళుతున్నాయి. లారీలు ఒకేసారి కాకుండా పది లారీలు ఒక గ్రూప్‌గా రవాణా చేస్తున్నారు. రాత్రి వేళ, తెల్లవారుజామున ఈ అక్రమ రవాణా కొనసాగుతోంది. మిల్లర్ల పేరుతో కొందరు నకిలీ పత్రాలు సృష్టించి ధాన్యం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రా నుంచి కొనుగోలు చేసిన సన్న ధాన్యాన్ని దళారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి బోనస్‌ స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సన్నధాన్యం అక్రమ రవాణాపై ఖమ్మం జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి చందన్‌ కుమార్‌ మాట్లాడుతూ ఏపీ ధాన్యాన్ని రాష్ట్రంలోకి అనుమతి లేని కారణంగా ఆదివారం జిల్లా సరిహద్దులో పట్టుకున్న లారీలను తిప్పి పంపించినట్లు తెలిపారు.


అంతరాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద నిఘాను మరింత ముమ్మరం చేశామని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆంధ్రా ధాన్యాన్ని రాష్ట్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు.. రాష్ట్రంలో నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్‌ బియాన్ని అక్రమార్కులు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లోని రైల్వేస్టేషన్లు ఈ అక్రమ రవాణాకు అడ్డాగా మారాయి. ఆటోల ద్వారా మేడ్చల్‌, ఘట్‌కేసర్‌, చర్లపల్లి రైల్వేస్టేషన్లకు చేర్చుతున్నారు. బియ్యాన్ని ప్యాసింజర్‌ రైళ్ల ద్వారా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. రైల్లోనూ ఎవ్వరికీ అనుమానం రాకుండా బాత్రుమ్‌ల్లో, రైలు డబ్బాలో పైన బియ్యం సంచులను వేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా చూస్తే రేషన్‌ బియ్యం సంచులతో తమకు సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తున్నారు. సాఫీగా తమ ప్రాంతానికి చేరితే అక్కడ వీరు సంచులను దింపుకొంటున్నారు. మధ్యలోనే తనిఖీల్లో విషయం బయటపడితే తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర ప్రాంతాల నుంచి కూడా ఆటోలో తీసుకువచ్చి రేషన్‌ బియ్యాన్ని కొందరు నాందేడుకు వెళ్లే రైల్లో తరలిస్తున్నారు. అధికారుల నిఘా కొరవడినంత కాలం వీరి దందా యథేచ్ఛగా సాగే అవకాశముంది.

Updated Date - Dec 16 , 2024 | 04:14 AM