ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టుకు 97 వేల క్యూసెక్కుల వరద..

ABN, Publish Date - Sep 27 , 2024 | 03:27 AM

పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది. కర్ణాటకలోని నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 75 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 25 గేట్లను ఎత్తి 80,240 క్యూసెక్కులను జూరాలకు విడుదల చేస్తున్నారు.

  • జూరాలకూ అంతే మొత్తంలో ఇన్‌ ఫ్లో

  • శ్రీరాంసాగర్‌కు లక్ష క్యూసెక్కుల ప్రవాహం

గద్వాల/పుల్కల్‌/మెండోర, సెప్టెంబరు 26 : పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది. కర్ణాటకలోని నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 75 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 25 గేట్లను ఎత్తి 80,240 క్యూసెక్కులను జూరాలకు విడుదల చేస్తున్నారు. జూరాలకు 97 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇందులో భీమా నుంచి 42 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. జూరాల 10 గేట్లను ఎత్తి 70,420 క్యూసెక్కులు.. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 34,346 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి 97,476 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 46,715 క్యూసెక్కులను వదులుతున్నారు.


తుంగభద్ర ప్రాజెక్టుకు 12 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 2 వేల క్యూసెక్కులు, కాలువలకు 10 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి గురువారం లక్షా 10 వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో నమోదైంది. దీంతో 22గేట్లను ఎత్తి 81,224 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు 14,563 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. రెండు గేట్ల ద్వారా 16,284 క్యూసెక్కులు, జలవిద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 2,823 క్యూసెక్కుల జలాలను దిగువకు వదులుతున్నారు.

Updated Date - Sep 27 , 2024 | 03:27 AM