ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jurala Project: జూరాల ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీరు జూరాల 16 గేట్లు ఎత్తివేత

ABN, Publish Date - Aug 24 , 2024 | 03:24 AM

పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు నుంచి అధికారులు నీటి విడుదలను పెంచారు.

  • శ్రీశైలానికి 1.39 లక్షల క్యూసెక్కులు

  • నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు నుంచి అధికారులు నీటి విడుదలను పెంచారు. జలాశయానికి 89 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండటంతో 16 గేట్లను మీటరు మేర ఎత్తి 66,112 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జూరాలలో 9.1 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు నుంచి 1,05,042 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలయాశయానికి వదులుతున్నారు.


శ్రీశైలం సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రాజెక్టులో ప్రస్తుతం 210.3 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి 1,39,147 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 69,333 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు. నాగార్జున సాగర్‌ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 309 టీఎంసీల నీరు ఉంది. సాగర్‌ నుంచి 48,214 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఇక, గోదావరి బేసిన్‌లోని మేడిగడ్డ బ్యారేజీలోకి 1.40 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 85 గేట్ల ద్వారా అంతే నీటిని పంపిస్తున్నారు.


ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రెండు మోటార్ల ద్వారా మిడ్‌ మానేరులోకి 6,300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 27 వరకు రాష్ట్రానికి యెల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Updated Date - Aug 24 , 2024 | 03:24 AM

Advertising
Advertising
<