Indian Laborer: నిర్మల్ వాసి ఆడు జీవితం
ABN, Publish Date - Aug 10 , 2024 | 04:45 AM
దళారుల మాటలు నమ్మి భారత్ నుంచి సౌదీ అరేబియా వెళ్లి ఎడారిలో ఒంటెల కాపరిగా పని చేసే ఓ వ్యక్తి దుర్భర జీవితం ఇతివృత్తంగా ఇటీవల ఆడు జీవితం అనే సినిమా వచ్చింది.
సౌదీలో ఒంటెల కాపరిగా నామ్‌దేవ్
రక్షించాలంటూ సెల్ఫీ వీడియో
టీజీఎండీసీ చైర్మన్ అనిల్ ట్వీట్‌తో భారత ఎంబసీ స్పందన
నామ్‌దేవ్ ఆచూకీ గుర్తించిన అధికారులు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి) : దళారుల మాటలు నమ్మి భారత్ నుంచి సౌదీ అరేబియా వెళ్లి ఎడారిలో ఒంటెల కాపరిగా పని చేసే ఓ వ్యక్తి దుర్భర జీవితం ఇతివృత్తంగా ఇటీవల ఆడు జీవితం అనే సినిమా వచ్చింది. తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు చెందిన రాథోడ్ నామ్‌దేవ్(51) అనే వ్యక్తి ఆ సినిమాలో మాదిరిగా సౌదీ ఎడారిలో దుర్భర జీవితం గడుపుతున్నాడు. ఈ కష్టాల నుంచి రక్షించండి అని వేడుకుంటూ నామ్‌దేవ్ ఇటీవల సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పెట్టడంతో ఈ విషయం బయటికొచ్చింది.
నామ్‌దేవ్ పెట్టిన వీడియోకు స్పందన రావడంతో అతను స్వదేశానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నామ్ దేవ్ పెట్టిన వీడియోకు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ(టీజీఎండీసీ) చైర్మన్ ఈరవత్రి అనిల్ స్పందించారు. నామ్‌దేవ్‌ను సురక్షితంగా స్వదేశానికి చేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి, కువైత్‌లోని భారత ఎంబసీ అధికారులను ఎక్స్(ట్విటర్) ద్వారా కోరారు. దీంతో కువైత్‌లోని భారత ఎంబసీ అధికారులు నామ్‌దేవ్‌ను సంప్రదించారు.
కువైత్ సరిహద్దులోని సౌదీ అరేబియా ఎడారిలో నామ్‌దేవ్ ఉన్నట్టు గుర్తించారు. చాలా కాలంగా గల్ఫ్‌లో ఉంటున్న నామ్‌దేవ్‌ను అతని యజమాని పది నెలల క్రితం సౌదీలోని ఒంటెల క్షేత్రానికి తరలించినట్టు తెలిసింది. కాగా, సౌదీ, కువైత్‌లోని ప్రవాసీయులు నామ్‌దేవ్‌ను సంప్రదించేందుకు యత్నించగా అతని ఫోన్ స్విచ్ఛా్‌ఫలో ఉంది. నామ్ దేవ్‌ను ఏ విధంగా స్వదేశానికి పంపిస్తారో తెలియాల్సి ఉంది.
Updated Date - Aug 10 , 2024 | 04:45 AM