ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: వరల్డ్‌ టాప్‌-100 బిజినెస్‌ స్కూల్స్‌లో ఐఎస్‌బీకి చోటు

ABN, Publish Date - Sep 26 , 2024 | 03:08 AM

ప్రపంచంలో అత్యుత్తమ బిజినెస్‌ స్కూల్స్‌ జాబితాలో హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ)కి చోటు లభించింది.

  • జాబితాలో భారత్‌ నుంచి మూడు ఐఐఎంలు

  • 58.3 స్కోర్‌తో హైదరాబాద్‌లోని ఐఎ్‌సబీకి 86వ స్థానం

హైదరాబాద్‌, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలో అత్యుత్తమ బిజినెస్‌ స్కూల్స్‌ జాబితాలో హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ)కి చోటు లభించింది. కోర్సులు, బోధన, ఉపాధి అవకాశాలు వంటి పలు అంశాల ఆధారంగా వరల్డ్‌ యునివర్సిటీ గ్లోబల్‌ ర్యాంకింగ్స్‌ను క్యూఎస్‌ సంస్థ విడుదల చేసింది. భారత్‌ నుంచి టాప్‌-100లో నాలుగు బిజినెస్‌ స్కూల్స్‌ చోటు సాధించాయి. అందులో 67.4 స్కోర్‌తో 53వ స్థానంలో ఐఐఎం బెంగళూరు, 63.3 స్కోర్‌తో 60వ స్థానంలో ఐఐఎం అహ్మదాబాద్‌, 62.6 స్కోర్‌తో 65వ స్థానంలో ఐఐఎం కోల్‌కతా, 58.3 స్కోర్‌తో హైదరాబాద్‌లోని ఐఎ్‌సబీ 86వ స్థానంలో నిలిచింది.


అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ 100శాతం స్కోర్‌తో వరుసగా ఐదోసారి అగ్రస్థానంలో నిలిచింది. అమెరికాకే చెందిన ఫిలడెల్ఫియాలోని పెన్‌ వార్టాన్‌ బిజినెస్‌ స్కూల్‌ 99.8 స్కోర్‌తో రెండోస్థానం, కేంబ్రిడ్జిలోని హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ 99.4తో మూడోస్థానం, కేంబ్రిడ్జిలోని ఎంఐటి స్లోన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్మెంట్‌ 99.2 స్కోర్‌తో నాలుగోస్థానం, లండన్‌ బిజినెస్‌ స్కూల్‌ 98.8తో ఐదోస్థానంలో నిలిచాయి.

Updated Date - Sep 26 , 2024 | 03:08 AM