ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: రేవంత్‌ ఇంటికి గోయల్‌..

ABN, Publish Date - Jul 01 , 2024 | 02:55 AM

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అధికారిక కార్యక్రమంపై నగరానికి వచ్చిన కేంద్ర మంత్రిని.. తన నివాసానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

  • హైదరాబాద్‌కు వచ్చిన కేంద్రమంత్రిని ఆహ్వానించిన సీఎం

  • రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ

  • భేటీలో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు, వేం నరేందర్‌రెడ్డి

  • రేవంత్‌ నివాసానికి గోయల్‌

హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అధికారిక కార్యక్రమంపై నగరానికి వచ్చిన కేంద్ర మంత్రిని.. తన నివాసానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు. దీంతో తన ఇంటికి వచ్చిన పీయూష్‌ గోయల్‌కు రేవంత్‌ స్వాగతం పలికారు. ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు.


ఎస్‌బీఐ నూతన చైర్మన్‌ శ్రీనివాసులుకు సీఎం శుభాకాంక్షలు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నూతన ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి ఎంపికపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన శ్రీనివాసులు ప్రతిష్టాత్మకమైన ఎస్‌బీఐ ఛైర్మన్‌ పదవిని అధిరోహించడం ఒక మహత్తర సందర్భమని వ్యాఖ్యానించారు. శ్రీనివాసులు శెట్టికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టారు. ఇక, ఎస్‌బీఐ చైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి ఎంపిక కావడంతో తెలంగాణ, ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jul 01 , 2024 | 02:55 AM

Advertising
Advertising