ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponguleti: వార్తా చిత్రాలు ఎంతో శక్తిమంతమైనవి..

ABN, Publish Date - Aug 20 , 2024 | 05:17 AM

సృజనాత్మకతతో తీసే ఫొటో పాఠకుల్ని ఆలోచింపజేస్తుందని, వార్తా చిత్రాలకు ప్రజలను ప్రభావితం చేస్తూ భావోద్వేగాలను రేకెత్తించే శక్తి ఉంటుందని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నా రు.

  • మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి

హైదరాబాద్‌, బర్కత్‌పుర, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): సృజనాత్మకతతో తీసే ఫొటో పాఠకుల్ని ఆలోచింపజేస్తుందని, వార్తా చిత్రాలకు ప్రజలను ప్రభావితం చేస్తూ భావోద్వేగాలను రేకెత్తించే శక్తి ఉంటుందని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నా రు. అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన వేడుకల్లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా తెలంగాణ ప్రభు త్వం అమలు చేస్తున్న అభయ హస్తం హామీలపై నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో ఎంపికైన ఫొటోగ్రాఫర్లకు మంత్రి మొమెంటో, నగదు పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఫొటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, పౌరసంబంధాల శాఖ అధికారులు పాల్గొన్నారు.


  • ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్లకు అవార్డులు

ఆయా కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్లు అవార్డులు సొంతం చేసుకున్నారు. వీరగోని హరీశ్‌ (వరంగల్‌)కు చేయూత కేటగిరీలో మొదటి బహుమతి, బెస్ట్‌ న్యూస్‌ పిక్చర్‌ కేటగిరీలో కన్సొలేషన్‌ అవార్డు లభించింది. ముచ్చెర్ల విజయ్‌(నల్లగొండ)కు మహాలక్ష్మీ, రైతుభరోసా కేటగిరీల్లో, హరిప్రేమ్‌ (హైదరాబాద్‌)కు చేయూత కేటగిరీలో కన్సొలేషన్‌ అవార్డులు దక్కాయి.


తెలంగాణ స్టేట్‌ ఫోటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌(టీఎ్‌సపీజేఏ) ఏర్పాటు చేసిన బెస్ట్‌ న్యూస్‌ పిక్చర్‌ అవార్డు కేటగిరీలో జ్వాలా కోటేశ్వరరావు(హైదరాబాద్‌), ముచ్చెర్ల విజయ్‌(నల్లగొండ) కన్సొలేషన్‌ బహుమతి గెలుచుకున్నారు. అశోకుడు యాదవ్‌(హైదరాబాద్‌)కు టీఎ్‌సపీజేఏతోపాటు ఏపీపీజేఏ, ఏయూవర్సిటీలో ఏర్పాటుచేసిన న్యూస్‌ పిక్చర్‌ అవార్డు కేటగిరీల్లో బహుమతులు లభించాయి.

Updated Date - Aug 20 , 2024 | 05:17 AM

Advertising
Advertising
<