ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Politics: అందుకే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు.. బీజేపీ నేతలపై జగదీష్ రెడ్డి ఆగ్రహం

ABN, Publish Date - Mar 24 , 2024 | 04:53 PM

ఈడీ కేసుల పేరుతో ఎన్నికల ముందు ప్రతిపక్షాల నోరు నొక్కాలని కేంద్ర బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వల్ల బీజేపీ రాబోయే ఎన్నికల్లో ఓడిపోతుందని మోదీ అండ్‌ కో భయపడ్డారని విమర్శించారు.

హైదరాబాద్: ఈడీ కేసుల పేరుతో ఎన్నికల ముందు ప్రతిపక్షాల నోరు నొక్కాలని కేంద్ర బీజేపీ(BJP) నేతలు కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR), ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (Kejriwal) వల్ల బీజేపీ రాబోయే ఎన్నికల్లో ఓడిపోతుందని ప్రధాని మోదీ అండ్‌ కో భయపడ్డారని విమర్శించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ఈడీ విచారించాలని డిమాండ్ చేశారు. లిక్కర్ కేసులో రెండేళ్లుగా ఆధారాలున్నాయని కిషన్‌రెడ్డి చెబుతున్నారని.. మరి ఆధారాలను ఈడీకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని కేసీఆర్ గొంతును బీజేపీ నేతలు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Jagtial Drugs Case: జగిత్యాల డ్రగ్స్ కేసులో మరో సంచలన కోణం.. గంజాయి ఇచ్చి మరీ ఓ యువతిపై..

రాష్ట్రంలో రైతులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. లక్షలాది ఎకరాల పంట పొలాలు ఎండి పోతున్నాయని చెప్పారు. కాళేశ్వరంలో కుంగిన పిల్లర్ల పేర్లు చెప్పి కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారన్నారు. హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కరువు కమ్మకొస్తున్నా రేవంత్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సాగర్ డ్యాం పైకి వెళ్లాలంటే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీళ్ల మీద పరిజ్ఞానం లేదని చెప్పారు. కోమటిరెడ్డి నల్గొండలో ఇండ్లు కట్టుకునే పేదల నుంచి రూ.50వేలు వసూలు చేస్తున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

KTR: యూట్యూబ్ ఛానెళ్లకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేస్తే పరువునష్టంతో పాటు క్రిమినల్ చర్యలు

Kavitha: కవితకు 'ఈడీ' మరో ఊహించని షాక్!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 04:53 PM

Advertising
Advertising