ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బ్యారేజీల వైఫల్యానికి కారణాలేంటి?

ABN, Publish Date - Aug 28 , 2024 | 05:03 AM

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల వైఫల్యంపై జస్టిస్‌ పినాకిచంద్ర ఘోష్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. మంగళవారం నీటిపారుదలశాఖలోని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో)లో పనిచేసిన, పదవీ విరమణ చేసిన ఇంజనీర్లను కమిషన్‌ ప్రశ్నించింది.

  • స్థలాలు పరిశీలించకుండానే డిజైన్లు చే శారా?.. డిజైన్లు సిద్ధం చేయాలని ఆదే శించింది ఎవరు?

  • సీడీవో ఇంజనీర్లపై కాళేశ్వరం కమిషన్‌ ప్రశ్నలు

  • ఐదుగురు అధికారుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌

  • రాష్ట్ర ప్రజల కన్నీళ్లు తుడవడానికే కాళేశ్వరం

  • ప్రాజెక్టును కమీషన్ల కోసం కట్టలేదు: వి.ప్రకాశ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల వైఫల్యంపై జస్టిస్‌ పినాకిచంద్ర ఘోష్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. మంగళవారం నీటిపారుదలశాఖలోని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో)లో పనిచేసిన, పదవీ విరమణ చేసిన ఇంజనీర్లను కమిషన్‌ ప్రశ్నించింది. ఇదివర కే అఫిడవిట్లు దాఖలు చేసిన ఇంజనీర్లను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసింది. ఈ సందర్భంగా.. బ్యారేజీల వైఫల్యానికి కారణాలేంటి? డిజైన్లు సిద్ధం చేసిన తర్వాత అన్నారం, సుందిళ్ల నిర్మాణ ప్రదేశాలను ఎందుకు మార్చారు? సైట్‌లు మార్చిన తర్వాత తదనుగుణంగా డిజైన్లు/డ్రాయింగ్‌లలో మార్పులు చేయలేదా? అని ప్రశ్నించింది.

అన్నారం బ్యారేజీ డి జైన్లను ఎవరు సిద్ధం చేశారని మాజీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కె.నరేందర్‌ను కమిషన్‌ ప్రశ్నించగా.. డి జైన్లు/డ్రాయింగ్‌లు ఏఈఈలు తయారు చేస్తారని, వాటిని డీఈఈ పరిశీలించాక.. తదుపరి అనుమతి కోసం తమ వద్దకు వస్తాయని బదులిచ్చారు. హైపవర్‌ కమిటీ ఆదేశాలతో డిజైన్లు సిద్ధం చేశామని అఫిడవిట్‌లో చెప్పారు కదా? ఆ కమిటీలో ఎవరున్నారు? అని ప్రశ్నించగా.. ఎవరున్నారో తెలియదన్నారు. డిజైన్‌, డ్రాయింగ్‌లు ఏ విధంగా చేస్తారని ప్రశ్నించగా.. సైట్‌ సర్వే, జియో ఫిజికల్‌ ఇన్వెస్టిగేషన్స్‌, పర్యావరణ పరిస్థితుల ఆధారంగా డిజైన్లు, డ్రాయింగ్‌లు సిద్ధం చేస్తామని నరేందర్‌ బదులిచ్చారు.


డిజైన్లలో ఎలాంటి లోపాల్లేవు..

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ డి జైన్లలో లోపాల్లేవని, వందశాతం భారతీయ ప్రమాణాల (ఐఎస్‌) కోడ్‌, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ అండ్‌ పవర్‌ (సీబీఐపీ)కి లోబడి ఎల్‌అండ్‌టీ ఆధునిక సాఫ్ట్‌వేర్‌తో తయారు చేసిందని కాళేశ్వరం ఎస్‌ఈ, సీడీవో మాజీ ఈఈ హెచ్‌.బస్వరాజ్‌ తెలిపారు. డిజైన్‌లు/డ్రాయింగ్‌లు పూర్తిగా ప్రమాణాలకు లోబడి ఉన్నాయని గుర్తించే.. వాటిని ఆమోదించినట్లు పేర్కొన్నారు. బ్యారే జీ నిర్మిత ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత డిజైన్లు సిద్ధం చేశారా? అని కమిషన్‌ ప్రశ్నించగా.. స్థలాన్ని పరిశీలించలేదని, క్షేత్రస్థాయి అధికారులిచ్చిన డేటా ఆధారంగా డిజైన్లు సిద్ధం చేశామని బదులిచ్చారు. బ్యారేజీల మార్పు నిర్ణయం ఎవరిదని ప్రశ్నించగా.. ఆ నిర్ణయం రామగుండం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు తీసుకున్నదేనని చెప్పారు.

అన్నారం, సుందిళ్లను మార్చినా మేడిగడ్డను ప్రతిపాదిత నిర్మాణ ప్రదేశంలోనే కట్టారని తెలిపారు. బ్యారేజీల వైఫల్యానికి డిజైన్లు కారణమా? అని కమిషన్‌ ప్రశ్నించగా.. డిజైన్లు వందశాతం కచ్చితత్వంతో ఉన్నాయని, వైఫల్యానికి డిజైన్లు ఎంత మాత్రం కారణం కాదని బస్వరాజ్‌ స్పష్టం చేశారు. మేడిగడ్డ కుంగిన తర్వాత ఆ ప్రాంతాన్ని పరిశీలించామని, అప్‌స్ట్రీమ్‌, డౌన్‌స్ట్రీమ్‌ కటా్‌ఫలు దెబ్బతిన్నట్లు గుర్తించామని తెలిపారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీ పునాది (రాఫ్ట్‌) కింద ఇసుక జారిందని, సీకెంట్‌ పైల్స్‌లో లోపాలు, కటాఫ్‌ హారిజాంటల్‌, వర్టికల్‌ డైరెక్షన్‌ల మార్పుల వల్ల బ్యారేజీ కుంగిందని సీడీవో ఎస్‌ఈ ఎం.సత్యనారాయణరెడ్డి చెప్పారు. 2డీ, 3డీ, మోడల్‌ స్టడీ్‌సల ప్రాముఖ్యమేంటి? డి జైన్లు, డ్రాయింగ్‌లను వీటి ఆధారంగానే మొదలుపెట్టారా? అని కమిషన్‌ ఆరా తీయగా... మోడల్‌ స్టడీస్‌, ప్రాథమిక వివరాల ఆధారంగా స్ట్రక్చరల్‌ డ్రాయింగ్‌లు సిద్ధం చేశామని బదులిచ్చారు.


అఫిడవిట్‌లో పేర్కొని.. కట్టుబడి ఉండకపోతే ఎలా?

అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉండకపోతే ఎలా? అని సీడీవో డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ కె.దయాకర్‌రెడ్డిని కమిషన్‌ ప్రశ్నించింది. ‘‘బ్యారేజీలు నిల్వల కోసం కాదు.. నీటి మళ్లింపు కోసం కట్టాలి. రిజర్వాయర్లు నీటి నిల్వ కోసం కట్టాలి. కానీ, కాళేశ్వరంలోని బ్యారేజీలను నిల్వల కోసం కట్టినందువల్లే ఆ బ్యారేజీలు విఫలమయ్యాయి’’ అని ఉటంకిస్తూ రాసిన లేఖలోని అంశాలను అఫిడవిట్‌లో దయాకర్‌రెడ్డి ప్రస్తావించడంపై కమిషన్‌ ప్రశ్నించగా.. ఆయన సమాధానం దాటవేశారు.

అన్నారం బ్యారేజీ డిజైన్‌లలో మార్పులు ఏమైనా జరిగాయా? అని ప్రశ్నించగా.. ఫిష్‌ ప్యాసేజ్‌ లెవల్‌లో మార్పులు జరిగాయని చెప్పారు. అన్నారం బ్యారేజీలో ఏమేమి గుర్తించారని ప్రశ్నించగా.. సీసీ బ్లాకులు కొట్టుకుపోయాయని, డౌన్‌స్ట్రీమ్‌ అఫ్రాన్‌ అదనంగా పెట్టాలని సిఫారసు చేశామని తెలిపారు. ఇక అన్నారం, సుందిళ్ల డిజైన్లను రామగుండం ఈఎన్‌సీ ఇచ్చిన డేటా ఆధారంగా సిద్ధం చేశామని సీడీవో మాజీ ఎస్‌ఈ తరిగొప్పుల రాజశేఖర్‌ అన్నారు. దిగువ శ్రేణిలో ఉన్న డిప్యూటీ ఈఈ, ఈఈలు పరిశీలించిన తర్వాత తదుపరి పరిశీలన కోసం తమ వద్దకు వస్తాయని తెలిపారు.


ప్రజల కన్నీళ్లు తుడిచేందుకే కాళేశ్వరం..

కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్ల కోసం కట్టలేదని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ(టీడబ్ల్యూఐడీసీ) మాజీ చైర్మన్‌ వి.ప్రకాశ్‌ చెప్పారు. రాష్ట్ర ప్రజల కన్నీళ్లు తుడవడానికే ప్రాజెక్టును నిర్మించినట్లు తెలిపారు. మంగళవారం ఆయన కాళేశ్వరం విచారణ కమిషన్‌ ముందు హాజరై.. అఫిడవిట్‌ దాఖలు చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై 17పేజీలతో అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు చెప్పా రు.

ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాగ్‌ ఇచ్చిన నివేదికపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జవాబు ఇస్తూ.. ప్రాణహిత చేపడితే 165 టీఎంసీల్లో 44 టీఎంసీలే తెలంగాణకు వచ్చేవని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. కాళేశ్వరం బ్యారేజీలపై ఎన్‌డీఎ్‌సఏ నుంచి నివేదికను తెప్పించుకొని, మేడిగడ్డను సత్వర పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరారు. కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరా మ్‌, విద్యుత్తు రంగ నిపుణుడు కె.రఘు విచారణను తప్పుదోవ పట్టించేలా సమాచారం ఇచ్చారని ఆరోపించారు.

Updated Date - Aug 28 , 2024 | 05:03 AM

Advertising
Advertising
<