ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: ‘రింగ్‌ రోడ్డు’ రైతుకు న్యాయం చేయాలి: లక్ష్మణ్‌

ABN, Publish Date - Dec 28 , 2024 | 05:06 AM

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో నష్టపోతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు న్యాయం చేయాలని సీఎం రేవంత్‌ను బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో నష్టపోతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు న్యాయం చేయాలని సీఎం రేవంత్‌ను బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు రూపొందించిన అలైన్‌మెంట్‌తో వేలాది మంది రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ను పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మనోహర్‌రెడ్డి నేతృత్వంలో బాధిత రైతులు కలిశారు.


రీజినల్‌ రింగ్‌రోడ్డు అశాస్త్రీయ అలైన్‌మెంటుతో జరుగుతున్న అన్యాయాన్ని వారు వివరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. రీజినల్‌ రింగ్‌రోడ్డుకు తాము వ్యతిరేకం కాదని, కానీ రోడ్డు అలైన్‌మెంటు శాస్త్రీయంగా లేదన్నారు. రైతులకు న్యాయం చేయకుంటే బీజేపీ ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు.

Updated Date - Dec 28 , 2024 | 05:06 AM