TG Politics: కాంగ్రెస్‌లోకి వెళ్లడంపై కడియం శ్రీహరి కీలక ప్రకటన
ABN, Publish Date - Mar 30 , 2024 | 03:55 PM
బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వెళ్లడంపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) కీలక ప్రకటన చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ కార్యకర్తలతో కడియం శ్రీహరి శనివారం నాడు సమావేశం అయ్యారు.
వరంగల్: బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వెళ్లడంపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) కీలక ప్రకటన చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ కార్యకర్తలతో కడియం శ్రీహరి శనివారం నాడు సమావేశం అయ్యారు. పార్టీ మారుదామా వద్దా అని కార్యకర్తలను కడియం అడిగారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేమని కడియంకు కార్యకర్తలు చెప్పారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంటే ఉంటామని ఏక వాక్య తీర్మానాన్ని కడియం శ్రీహరి అనుచరులు చేశారు. అయితే కార్యకర్తల నిర్ణయాన్ని బట్టి తాను నడుస్తానని కడియం తెలిపారు.
TG Politics: కాంగ్రెస్‌లోకి నందమూరి సుహాసిని.. కీలక పదవి!
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి భయమెందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు పసునూరి దయాకర్, ఆరూరి రమేష్ పార్టీ మారితే లేని అభ్యంతరం తన విషయంలో ఎందుకని నిలదీశారు. తన రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి ఆరోపణ లేదని చెప్పారు. తనపై ఒక్క పెట్టి కేసు కూడా లేదన్నారు. తన కుమార్తె కడియం కావ్యకు ఎంపీ టిక్కెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తెలిపారు. ఉద్యమ కారులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. తనకు వచ్చిన అవకాశాన్ని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగిస్తానని తెలిపారు. జిల్లాల్లో పక్క నియోజకవర్గాల్లో అభివృద్ధి జరిగిందని.. ఒక్క స్టేషన్ ఘన్‌పూర్ మాత్రమే వెనుకపడిందని కడియం శ్రీహరి అన్నారు.
Congress: కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్ మేయర్.. సోదరుడు కూడా
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 30 , 2024 | 03:58 PM