BRS: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. నేడు కాంగ్రెస్‌లోకి కీలక నేత
ABN, Publish Date - Mar 29 , 2024 | 07:05 AM
నేడు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.
వరంగల్ : నేడు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) కాంగ్రెస్ (Congress)లో చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లో కడియం చేరికతో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. కడియం శ్రీహరి బీఆర్ఎస్ (BRS)ను వీడటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ పార్టీకి గట్టి దెబ్బే తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధిష్టానం.. లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha Elections) అభ్యర్థి కోసం సెర్చ్ చేస్తోంది.
ప్రభాకర్‌రావు ఆదేశించారు రాధాకిషన్ అమలు చేశారు
పార్లమెంట్ (Parliament) ఎన్నికల ముందు బీఆర్ఎస్(BRS)కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలందరూ వరుసగా కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరుతున్న విషయం తెలిసిందే. ఇదేకోవలో వరంగల్ లోక్‌సభ అభ్యర్థి కడియం కావ్య(Kadiyam Kavya) కూడా బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరనున్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య స్పష్టం చేశారు. బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు ఈ విషయంపై కావ్య లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, పార్టీకి జనాదరణ కరువైన నేపథ్యంలో ఎంపీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కావ్య ప్రకటించారు. ఈ క్రమంలోనే స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు. పార్లమెంట్ బరిలో వరంగల్ కాంగ్రెస్ నుంచి కడియం శ్రీహరి లేదా కావ్యకు టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తనఖా భూముల పాస్‌బుక్‌లకు విముక్తి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 29 , 2024 | 07:12 AM