Kaleshwaram project: సంతకాల కోసం కేసీఆర్, హరీశ్ ఒత్తిడి చేశారు..
ABN, Publish Date - Aug 23 , 2024 | 02:50 AM
కాళేశ్వరం బ్యారేజీల డిజైన్‌లు/డ్రాయింగ్‌లు సంపూర్ణంగా అధ్యయనం చేసే అవకాశాన్ని అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులు తమకు ఇవ్వలేదని మాజీ ఈఎన్‌సీ, సెంట్రల్ డి జైన్ ఆర్గనైజేషన్(సీడీవో) ఎ.నరేందర్‌రెడ్డి వెల్లడించారు.
ఫోన్ చేసి.. సమస్య ఏమిటని తొందరపెట్టారు
బ్యారేజీల నిర్మాణం డిజైన్ల ప్రకారం జరుగుతోందా అనేది పరిశీలించలేకపోయా
నాటి ప్రభుత్వం అవకాశమే ఇవ్వలేదు.. 3డీ అధ్యయనం లేకుండా డిజైన్ల ఖరారు
సంతకం చేయడానికి నాలుగైదు రోజులు నిరాకరించా
బాధ్యత తనదేనంటూ కాళేశ్వరం ఈఎన్‌సీ లేఖ ఇచ్చాకే సంతకాలు పెట్టా
ఆ తర్వాత ఆ లేఖను తొలగించారు.. ఆర్టీఐ ద్వారా ఈ వివరాలు తెలిశాయి
మేడిగడ్డ డిజైన్లలో ఎల్‌అండ్‌టీ పాత్ర.. దీనికి ఆధారంగా 600 పేజీల ఈమెయిళ్లు
కాళేశ్వరం కమిషన్ సమక్షంలో వెల్లడించిన మాజీ ఈఎన్‌సీ ఎ.నరేందర్‌రెడ్డి
హైదరాబాద్, ఆగ స్టు 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీల డిజైన్‌లు/డ్రాయింగ్‌లు సంపూర్ణంగా అధ్యయనం చేసే అవకాశాన్ని అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులు తమకు ఇవ్వలేదని మాజీ ఈఎన్‌సీ, సెంట్రల్ డి జైన్ ఆర్గనైజేషన్(సీడీవో) ఎ.నరేందర్‌రెడ్డి వెల్లడించారు. హడావుడిగా డిజైన్లు/డ్రాయింగ్‌లపై సంతకాలు చేయాలని కేసీఆర్, హరీశ్‌రావు, రామగుండం మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఈఎన్‌సీ బి.హరిరాం తనపై ఒత్తిడి చేశారన్నారు. 3 డీ అధ్యయనం తర్వాత డి జైన్లు/డ్రాయింగ్‌లు రూపొందించాల్సి ఉండగా... 2 డీ అధ్యయనం తర్వాతే వీటిని తయారు చేయాల్సిన పరిస్థితి ఒత్తిళ్ల కారణంగా నెలకొందని వెల్లడించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణలో భాగంగా గురువారం నరేందర్‌రెడ్డిని ప్రశ్నించారు. డిజైన్లు/డ్రాయింగ్‌లతో ముడిపడిన పలు అంశాలపై కమిషన్ ప్రశ్నలు సంధించింది. తమను తొందరపెట్టి, ఒత్తిళ్లకు గురి చేయడం ద్వారా ఆమోదించాల్సిన అనివార్యతను కల్పించారని నరేందర్‌రెడ్డి కమిషన్‌కు చెప్పారు. ‘‘కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల ప్రకారం సెంట్రల్ డి జైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో)కు అధిపతిగా ఈఎన్‌సీ ఉండాలి. ఈఎన్‌సీ(సీడీవో) కింద హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్, డిజైన్, డ్రాయింగ్‌లకు వేర్వేరుగా సీఈలు పనిచేయాలి. ఈ డిజైన్లను కేంద్ర జల సంఘానికి పంపించే ముందు డీపీఆర్‌లోని చెక్ లిస్ట్‌పై ఈఎన్‌సీ(సీడీవో) సంతకం చేయాలి. అయితే, కొన్నేళ్లుగా సీడీవో పరిధిలో హైడ్రాలజీ, ఇన్వెస్టిషన్‌లు లేవు.
వాటిని ఈఎన్‌సీ(జనరల్) కిందకు మార్చారు. ఈ కారణం వల్లే చెక్‌లి్‌స్టపై సంతకం చేయడానికి నిరాకరిస్తూ 4-5 రోజుల పాటు డీపీఆర్ చెక్‌లి్‌స్టపై సంతకాలు చేయలేదు’’ అని నరేందర్‌రెడ్డి వివరించారు. డిజైన్లన్నీ సిద్ధమయ్యాక సంతకాలు ఎందుకు పెట్టడం లేదు? సమస్య ఏంటీ? అని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, సాగునీటి మంత్రి హరీశ్‌రావులు ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చారని చెప్పారు. తర్వాత హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్లకు సంబంధించిన అంశాల బాధ్యత తనదేనని హరిరామ్ లేఖ ఇచ్చాకే డీపీఆర్ చెక్‌లి్‌స్టపై సంతకం చేశానని వెల్లడించారు. కాళేశ్వరం డిజైన్లకు సీఈ(సీడీవో)దే బాధ్యత అని, ఆయన చెక్‌లి్‌స్టపై సంతకం చేశారని వెదిరే శ్రీరామ్ ప్రకటించగా... ఇందులో వాస్తవాలేంటో ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం ద్వారా పత్రాలు సేకరించానని తెలిపారు.
ఇన్వెస్టిగేషన్లకు తానే బాధ్యత వహిస్తానని హరిరామ్ డీపీఆర్‌లో భాగంగా ఇచ్చిన లేఖను తొలగించినట్లు ఆర్టీఐ సమాచారంలో తేలిందని నరేందర్‌రెడ్డి చెప్పారు. సమాచార హక్కు ద్వారా సేకరించిన లేఖను నరేందర్‌రెడ్డి కాళేశ్వరం కమిషన్‌కు అందించారు. సాంకేతిక అనుమతి తీసుకున్నాక డిజైన్లు/డ్రాయింగ్‌లు మార్చవచ్చా?అని కమిషన్ ప్రశ్నించగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ఇతర పారామీటర్స్, క్షేత్రస్థాయి అధికారుల నివేదికల ఆధారంగా మార్పులు చేయడానికి వీలుంటుందని బదులిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు/డ్రాయింగ్‌లు చేయాలని ఆదేశించింది ఎవరు? కాళేశ్వరం నిర్మాణం చేయాలనే నిర్ణయం ఎవరిది? అని కమిషన్ అడిగింది.
ఉన్నత స్థాయిలోని నిర్ణయాల ఆధారంగా చేశామని, బ్యారేజీల ఎంపిక ప్రదేశాలు ఖరారు చేసుకున్నాక స్ట్రక్చరల్ డిజైన్ల తయారీకి ఫైలును పంపించారని, ఉన్నతస్థాయిలో జరిగిన ఏ సమీక్షకూ తనను పిలవలేదని బదులిచ్చారు. ఇచ్చిన డిజైన్లు/డ్రాయింగ్‌ల ప్రకారం పనులు జరుగుతున్నాయా? లేవా? పరిశీలించాల్సిన బాధ్యత ఇంజనీర్‌గా మీకు లేదా? అని కమిషన్ ప్రశ్నించగా... గత ప్రభుత్వం ఆ అవకాశమే ఇవ్వలేదన్నారు. నిర్మాణం చేపట్టడానికి ముందు బ్యారేజీలు కట్టే ప్రదేశాన్ని పరిశీలించి, ఎంత పొడవుతో కడుతున్నారనే వివరాలు తెలుసుకోవడం తప్ప మిగతా అంశాలను పరిశీలించలేదని తెలిపారు. రాఫ్ట్(పునాది), ఫైల్స్, అఫ్రాన్ పనులు, గేట్లు, పియర్స్(పిల్లర్లు), కవర్ డెప్త్‌లను మాత్రమే పరిశీలించామని వెల్లడించారు. మూడు బ్యారేజీల నిర్మాణంలో మీ పాత్ర ఏంటీ? అని కమిషన్ అడగ్గా, నిర్మాణపరంగా తమ పాత్ర లేదని చెప్పారు.
వరద ప్రవాహ వేగం అంచనాలు తప్పాయి?
మేడిగడ్డ బ్యారేజీ నుంచి వరద సెకనుకు 6 మీటర్ల వేగంతో వెళ్లేందుకు డిజైన్లను రూపొందించగా... సెకనుకు 15-16 మీటర్ల వేగంతో వరద ప్రవాహం ఉందని నిర్ధారణ అయింది కదా అని కమిషన్ ప్రశ్నించగా... అవునని నరేందర్ బదులిచ్చారు. వేగంగా బయటికి వచ్చే వరదకు బ్యారేజీ దిగువ భాగం దెబ్బతినకుండా నిర్మాణాలు జరుగలేదని కమిషన్ తప్పుపట్టింది.
హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ అంటే ఎవరు?
ఏయే నమూనా అధ్యయనాల తర్వాత డిజైన్లు సిద్ధం చేశారని కమిషన్ ప్రశ్నించగా... 2డీ నమూనా అధ్యయనం, జీఏడీ(డ్రాయింగ్) ఆధారంగా డిజైన్లు, డ్రాయింగ్‌లు చేశామని నరేందర్‌రెడ్డి వివరించారు. నిజానికి 3 డీ నమూనా అధ్యయనం తర్వాతే డిజైన్లు తయారు చేయాలన్నారు. నాటి సీఎం, మంత్రి ఒత్తిడి చేయడంతో 3 డీ అధ్యయనాలు రావడానికి ముందే డిజైన్లు తయారు చేశామని, దీనికి గవర్నర్‌మెంట్ ఒత్తిడియే కారణమని వివరించారు. గవర్నమెంట్ అంటే రాజ్యాంగం ఏమైనా నిర్వచనం ఇచ్చిందా? హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్ అంటే ఎవరు? మంత్రివర్గానికి బాస్ ఎవరు?
అని కమిషన్ ప్రశ్నించగా... ముఖ్యమంత్రే అని బదులిచ్చారు. బ్యారేజీల నిర్మాణం జరుగుతున్నప్పుడు హరీ్‌షరావు మంత్రిగా ఉన్నారని ప్రస్తావించారు. ఏ స్థాయి అధికారులు నమూనాను అధ్యయనం చేస్తారని కమిషన్ ప్రశ్నించింది. తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ ల్యాబోరేటరీ(టీఎ్‌సఈఆర్‌ఎల్)లో చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారి అని బదులిచ్చారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ మ్యానువల్ అనుసరించి... డిజైన్లు తయారు చేశారా? అని ప్రశ్నించగా... అవునని వివరించారు.
డిజైన్లు తయారు చేసిందెవరూ?
మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లు/డ్రాయింగ్‌లు ఎవరు తయారు చేశారని కమిషన్ ప్రశ్నించింది. వీటిని సీడీవో ఒక్కరేతయారు చేయలేదని, సీడీవోతో కలిసి ఎల్ అండ్ టీ తయారు చేసిందని నరేందర్‌రెడ్డి బదులిచ్చారు. ఎల్‌అండ్‌టీ ఇచ్చిన డిజైన్లను మక్కీకి మక్కీగా కాపీ ఎందుకు చేశారు? ఎందుకు ఆలోచించలేదు? అని కమిషన్ ప్రశ్నిస్తూ...బెంగాలీ సామెతను ప్రస్తావించింది. ప్రభుత్వ ఒత్తిళ్లను నరేందర్‌రెడ్డి కమిషన్‌కు వివరించారు. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లు/డ్రాయింగ్‌ల విషయంలో ఎల్‌అండ్‌టీకి, సీడీవోకు మధ్య ఈ-మెయిల్ ఆధారిత 600పేజీల ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయని ప్రస్తావించారు. ఆ వివరాలన్నీ కమిషన్‌కు అందజేస్తానని ప్రకటించారు.
నాలుగేళ్లు బ్యారేజీలను పట్టించుకోలేదు: నరేందర్‌రెడ్డి
బ్యారేజీలకు, డ్యామ్‌లకు మధ్య చాలా తేడా ఉంటుందని, బ్యారేజీలు నీటి నిల్వ కోసం కాదని, వచ్చిన నీటిని వచ్చినట్లే మళ్లించడానికని నరేందర్ రెడ్డి వివరించారు. వీటి పునాదులు సున్నితంగా ఇసుకపై ఉంటాయన్నారు. బ్యారేజీలు 2019 జూన్‌లో ప్రారంభం కాగా... వాటిని నాలుగేళ్లపాటు పట్టించుకోలేదని మాజీ ఈఎన్‌సీ నరేందర్‌రెడ్డి కమిషన్‌కు వివరించారు. నాలుగేళ్ల పాటు బ్యారేజీలను వదిలేయడం వల్లే వైఫల్యం చెందాయన్నారు. గేట్లు ఎత్తడంలోనూ టీఎ్‌సఈఆర్‌ఎల్ మాన్యువల్‌ను పాటించలేదని, బ్యారేజీల నిర్మాణంలో అతి సున్నితమైన సీకెంట్ పైల్స్ పనులను ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో చేశారని, కాంక్రీట్‌ను అపరిమిత వేగంతో నింపారని చెప్పారు. టెండర్ల ఖరారులో ఎస్‌ఈకి రామగుండం చీఫ్ ఇంజనీర్‌గా, బ్యారేజీల వైఫల్యంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలు ప్రధానంగా కారణమని తేలినా... ఈఎన్‌సీ(ఓఅండ్‌ఎం) పదవీ కాలం పొడిగించారని నివేదించారు.
నల్లా వెంకటేశ్వర్లుదే బాధ్యత
మేడిగడ్డ బ్యారేజీలో షీట్ ఫైల్స్‌కు బదులుగా సీకెంట్ పైల్స్ వేయడం వెనుక మాజీ రామగుండం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు తీసుకున్న నిర్ణయమే కారణమని మాజీ ఈఎన్‌సీ(జనరల్) సి.మురళీధర్ ప్రస్తావించారు. 2016 ఏప్రిల్ 11వ తేదీన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సాంకేతిక అనుమతుల ఉత్తర్వులు నల్లా వెంకటేశ్వర్లే ఇచ్చారని గుర్తు చేశారు. విచారణలో భాగంగా బుధవారం కొన్ని వివరాలు అసంపూర్తిగా ఇవ్వడంతో గురువారం కమిషన్ ముందు హాజరై.. ఆయన వివరాలు అందించారు.
అన్నారంలో తొలుత 58 గేట్లు పెట్టాలని నిర్ణయం తీసుకోగా... ఆ తర్వాత 66 గేట్లకు పెంచారు. 2022 ఫిబ్రవరి 22వ తేదీన కాళేశ్వరం డీపీఆర్‌ను అనుమతుల కోసం సీడబ్ల్యూసీలో దాఖలు చేయడం జరిగిందని, 2014 జూలై 22వ తేదీన జీవోనెం.10తో ప్రాణహితతో పాటు కాంతనపల్లి , దుమ్ముగూడెం ప్రాజెక్టులపై హై పవర్ కమిటీ వేశారని, దాదాపు 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందుతుదని చెప్పారని, కేవలం లక్ష ఎకరాలు మాత్రమే ఆ ప్రాజెక్టులో నీటిని అందించామని వెల్లడించారు.
Updated Date - Aug 23 , 2024 | 08:40 AM