ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Peddapalli: ఆదుకున్న ఎల్లంపల్లి

ABN, Publish Date - Sep 21 , 2024 | 04:10 AM

కాళేశ్వరం బ్యారేజీల నుంచి ఈ ఖరీ్‌ఫలో నీటిని ఎత్తిపోయకున్నా.. వాటిపై ఆధారపడిన ప్రాజెక్టులు మాత్రం జలకళను సంతరించుకున్నాయి.

  • కాళేశ్వరం బ్యారేజీలు పనిచేయకున్నా..నేరుగా ఎత్తిపోతలు

  • ఎగువన మల్లన్నసాగర్‌ దాకా జలకళ

పెద్దపల్లి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీల నుంచి ఈ ఖరీ్‌ఫలో నీటిని ఎత్తిపోయకున్నా.. వాటిపై ఆధారపడిన ప్రాజెక్టులు మాత్రం జలకళను సంతరించుకున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లన్నీ ఎత్తేసి, నీటిని వదిలేసినా.. వాటికి అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు నిండుగా ఉన్నాయి. కాళేశ్వరం బ్యారేజీలు మరమ్మతులకు గురై, మూలనపడ్డా.. వాటి పైన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈసారి రైతులను ఆదుకుంది. శ్రీరామసాగర్‌, కడెం నుంచి వచ్చిన వరదను మిడ్‌మానేరుకు.. అక్కడి నుంచి లోయర్‌మానేరు, మల్లన్నసాగర్‌దాకా తరలించడంలో ఎల్లంపల్లి ప్రధాన పాత్ర పోషించింది.


దీంతో ఆయా జలాశయాల కింద పొలాలు కళకళలాడుతున్నాయి. ఈయేడు వర్షాకాలం నాటికి అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు డెడ్‌ స్టోరేజీలోకి వెళ్లాయి. సీజన్‌ ప్రారంభంలో వర్షాలు పడకపోవడంతో సాగు, తాగునీటి కోసం అందరూ ఆందోళన చెందారు. కృష్ణా బేసిన్‌కు పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పటికీ గోదావరి బేసిన్‌లో అంతం త మాత్రంగానే వర్షాలు పడ్డాయి. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల మధ్య పడిన వర్షాల వల్ల ఎల్లంపల్లికి వరద వచ్చింది. దీనికి కడెం ప్రాజెక్టు ప్రవాహం తోడయింది. ఎల్లంపల్లి సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా, 16 టీఎంసీలకు చేరుకోగానే ఆగస్టు 3 నుంచి సెప్టెంబరు 7 వరకు అధికారులు నీటిని ఎత్తిపోశారు. 36 రోజుల్లో 23.75 టీఎంసీలను పంపించారు. ఎత్తిపోతలు ప్రారంభమయ్యే నాటికి మిడ్‌ మానేరులో 5.6 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలను ఆపకుండా వచ్చిన వరదను వచ్చినట్లే మిడ్‌ మానేరుకు ఎత్తిపోశారు.


  • కాళేశ్వరం రిపేర్లతో ఆందోళన..

మిడ్‌మానేరు నుంచి అనంతసాగర్‌, రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌ వరకు నీటిని తరలించారు. ఎస్సారెస్పీ నిండటంతో అక్కడి నుంచి వరదకాలువ ద్వారా మిడ్‌మానేరుకు నీటిని తరలించారు. పరీవాహక ప్రాం తాల్లో కురిసిన వర్షాలతో పాటు ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ నీటితో మిడ్‌మానేరు, ఎల్‌ఎండీలు పూర్తిస్థాయి నీటి మ ట్టానికి చేరుకున్నాయి. దీంతో వానాకాలంతోపాటు యా సంగి సాగుకు కూడా ఢోకా లేకుండాపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోగా, అన్నారం బ్యారేజీలో బుంగలు పడిన విషయం తెలిసిందే. సుందిళ్ల బ్యారేజీలోనూ సీపేజీ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఎన్‌డీఎ్‌సఏ అధికారుల సూచనల మేరకు వర్షాకాలంలో ఈ బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి ఉంచాలన్న అధికార సూచనలతో రైతులు ఆందోళన చెందారు. అయితే, ఆలస్యంగానె ౖనా కురిసిన వర్షాలతో ఎల్లంపల్లి నిండటం, అక్కడి నుం చి ఇతర రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సంతృప్తికర స్థాయిలో ఎల్లంపల్లిలో 20.175 టీఎంసీలు, మిడ్‌ మానేరులో 24.78, ఎల్‌ఎండీలో 23.21, ఎస్సారెస్పీలో 80 టీఎంసీల నీళ్లున్నాయి.

Updated Date - Sep 21 , 2024 | 04:10 AM