ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG News: డీకే అరుణ వల్లే పాలమూరులో కరువు: కాల్వ సుజాత

ABN, Publish Date - Apr 01 , 2024 | 06:45 PM

బీజేపీ (BJP) సీనియర్ నేత డీకే అరుణ(DK Aruna) వల్లే పాలమూరులో కరువు పరిస్థితులు వచ్చాయని టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత(Kalva Sujatha) అన్నారు. రాజకీయాలతో డీకే అరుణ, ఆమె కుటుంబం బాగుపడింది తప్ప పాలమూరు జిల్లాకు ఎలాంటి లాభం కలగలేదని చెప్పారు.

మహబూబ్‌నగర్: బీజేపీ (BJP) సీనియర్ నేత డీకే అరుణ (DK Aruna) వల్లే పాలమూరులో కరువు పరిస్థితులు వచ్చాయని టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత (Kalva Sujatha) అన్నారు. రాజకీయాలతో డీకే అరుణ, ఆమె కుటుంబం బాగుపడింది తప్ప పాలమూరు జిల్లాకు ఎలాంటి లాభం కలగలేదని చెప్పారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో కాల్వ సుజాత మీడియాతో మాట్లాడుతూ...కాంగ్రెస్‌ (Congress)లో మంత్రిగా పని చేసి, ఎమ్మెల్యేగా దీర్ఘ కాలం పని చేసిన అరుణ పాలమూరు జిల్లాకు ఏమి చేశారో చెపితే బాగుంటుందన్నారు. దొరసాని అన్నందుకే జడుసుకుంటున్న అరుణ.. గతంలో సీఎం రేవంత్ రెడ్డి గురించి ఎలాంటి మాటలు మాట్లాడిందో పాలమూరు ప్రజలకు తెలుసునని చెప్పారు.

Congress: కేసీఆర్ కుటుంబం తప్పా మిగతా నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్దం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

పాలమూరు కరువుకు అరుణ కారణం కాదా అని ప్రశ్నించారు. జాతీయ నాయకురాలిగా మంచి రాజకీయ పరిచాయలున్న ఆమె పాలమూరు జిల్లాకు చేసిన ప్రగతి ఏంటని నిలదీశారు. పదేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం పాలమూరు జిల్లాకు ఒక్క పైసా అయిన ఇచ్చిందా అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. నిరుద్యోగుల ఉపాధి కోసం ఒక్క పరిశ్రమ అయిన తెచ్చారా అని ప్రశ్నించారు. పాలమూరు కరువుకు, వలసలకు కారణం అరుణేనని అన్నారు. జిల్లా అభివృద్ధికి ఆమె చేసింది ఏమిటో చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో అరుణ ఓడిపోవడం ఖాయమని కాల్వ సుజాత అన్నారు.

Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై కీలక అప్డేట్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 01 , 2024 | 10:56 PM

Advertising
Advertising