ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sangareddy: త్రీడీ ప్రింటింగ్‌తో పాదచారుల వంతెన..

ABN, Publish Date - Jun 21 , 2024 | 03:25 AM

త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో తక్కువ కాంక్రీటును వినియోగించి, అత్యంత వేగంగా దేశంలోనే తొలిసారిగా పాదచారుల వంతెనను ఐఐటీ-హెచ్‌ శాస్త్రవేత్తలు నిర్మించారు. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ-హెచ్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ కేవీఎల్‌ సుబ్రమణ్యం తన బృందంతో దీన్ని క్యాంపస్‌ ప్రాంగణంలో నిర్మించారు.

  • దేశంలోనే తొలిసారిగా కంది ఐఐటీ-హెచ్‌లో నిర్మాణం

కంది, జూన్‌ 20 : త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో తక్కువ కాంక్రీటును వినియోగించి, అత్యంత వేగంగా దేశంలోనే తొలిసారిగా పాదచారుల వంతెనను ఐఐటీ-హెచ్‌ శాస్త్రవేత్తలు నిర్మించారు. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ-హెచ్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ కేవీఎల్‌ సుబ్రమణ్యం తన బృందంతో దీన్ని క్యాంపస్‌ ప్రాంగణంలో నిర్మించారు. మెటీరియల్‌ ఫాలోస్‌ పోర్స్‌ని అనుసరించి నిర్మించిన ఈ వంతెన పొడవు దాదాపు 7.5 మీటర్లు. గురువారం ప్రొఫెసర్‌ కేవీఎల్‌ సుబ్రమణ్యం ఈ వంతెనను పరిశీలించారు.


ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింప్లిపోర్జ్‌ క్రియేషన్స్‌ స్టార్టప్‌ కంపెనీ సహకారంతో దీన్ని నిర్మించామని, నిర్మాణంలో డిజైన్‌ మెథడాలజీలో అనేక పురోగతుల రూపకల్పన జరిగిందన్నారు. మిగతా వంతెనల కంటే ఇది తక్కువ బరువు ఉంటుందని, అత్యంత వేగంగా ఈ వంతెనను నిర్మించవచ్చన్నారు. అంతేగాక ఈ వంతెన నిర్మాణానికి మానవ వనరుల అవసరం తక్కువగా, యంత్రాల వినియోగం ఎక్కుగా ఉంటుందని వివరించారు. ఐఐటీ-హెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి మాట్లాడుతూ దేశంలో మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడానికి సాంకేతికతతో కూడిన పరిష్కారాలు ఎంతో అవసరమని అన్నారు.

Updated Date - Jun 21 , 2024 | 03:25 AM

Advertising
Advertising