ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bandi Sanjay: రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN, Publish Date - Mar 20 , 2024 | 03:18 PM

Telangana: పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కేసీఆర్‌ లాగా రైతులను మోసం చేయొద్దన్నారు. సిరిసిల్ల జిల్లా రైతులను ఆదుకోవాలన్నారు. అప్పులు చేసి పంటలు వేశారని.. చేతికి వచ్చే సమయానికి వర్షం పాలైందని తెలిపారు. పదేళ్లలో ఒక్క రైతుకు కూడా పంట నష్ట పరిహారం ఇవ్వలేదన్నారు.

సిరిసిల్ల, మార్చి 20: పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ (MP Bandi Sanjay) డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కేసీఆర్‌ లాగా రైతులను మోసం చేయొద్దన్నారు. సిరిసిల్ల జిల్లా రైతులను ఆదుకోవాలన్నారు. అప్పులు చేసి పంటలు వేశారని.. చేతికి వచ్చే సమయానికి వర్షం పాలైందని తెలిపారు. పదేళ్లలో ఒక్క రైతుకు కూడా పంట నష్ట పరిహారం ఇవ్వలేదన్నారు. ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలన్నారు. పంటల బీమా అమలు చేయాలని.. ఎన్నికల పేరుతో కాలయాపన చేయొద్దని హితవుపలికారు. రైతులను ఆదుకోవాలని... తామూ సహకరిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.

కాగా.. రెండు రోజుల క్రితం సిరిసిల్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడిన విషయం తెలిసిందే. వరి కోత దశలో ఉన్న వరి పొలాలకు వడగండ్ల వానతో నష్టం వాటిల్లింది. అకాల వర్షానికి వరి పంటలు నేలరాలాయి. చేతికి వచ్చిన పంట అకాల వర్షాలకు దెబ్బతినడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు.

ఇవి కూడా చదవండి..

Viral News: హెలిక్యాప్టర్‌ కారుకు పోలీసుల చలాన్.. నెటిజన్ల ఆగ్రహం

YCP: టీడీపీ అభ్యర్థినైన నన్ను గెలిపించండని కోరిన వైసీపీ అభ్యర్థి


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 20 , 2024 | 03:33 PM

Advertising
Advertising