ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BRS: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

ABN, Publish Date - Mar 11 , 2024 | 11:38 AM

Telangana: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ పురుషోత్తం, ఆశిష్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

కరీంనగర్, మార్చి 11: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై (MLA Padi Kaushikreddy) కేసు నమోదు అయ్యింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ పురుషోత్తం, ఆశిష్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. పోలీసులపై ఇటీవల బెదిరింపు ధోరణినితో కౌశిక్ రెడ్డి మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది.

YSRCP: చిత్తూరు వైసీపీలో ముసలం ప్రారంభం


కౌశిక్ రెడ్డి ఏమన్నారంటే...

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పోలీసులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘పోలీసులతో ఏమీ అయ్యేది లేదు.. పీకేదేం లేదు. మల్లా మేం వచ్చిన తర్వాత బిడ్డా మిత్తితో సహా వసూలు చేస్తాం. జాగ్రత్తగా ఉండుండ్రి. జిల్లాలో పోలీసులు ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుండ్రు. తస్మాత్ జాగ్రత్త. ఎవరినీ వదిలిపెట్టం. మీరు భయపెట్టిస్తే.. భయపడేటోళ్లు లేరు. మేం అన్యాయం చేసేటోళ్లం కాదు. అన్యాయంగా కేసులు పెట్టి బీఆర్‌ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడ్తుండ్రు. మీరు కూడా జైలుకు పోయే రోజులు వస్తాయ్.. రాసి పెట్టుకోండ్రి’’ అంటూ పోలీసులను ఉద్దేశించి ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి...

CM Revanth: యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

YSRCP: అన్నింటా..‘పెద్ద’ రెడ్డే..!



మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 11 , 2024 | 11:41 AM

Advertising
Advertising