ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BNS Act: బీఎన్‌ఎస్ యాక్ట్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై మొట్టమొదటి కేసు...

ABN, Publish Date - Jul 03 , 2024 | 10:14 AM

Telangana: హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. బీఎన్ఎస్ యాక్టులో కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ అమలులోకి వచ్చిన రెండో రోజే ఎమ్మెల్యేపై కేసు నమోదు అయ్యింది. నిన్న (మంగళవారం) జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జెడ్పీ సీఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

MLA Padi koushik Reddy

కరీంనగర్, జూలై 3: హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై (BRS MLA PAdi Koushikredddy) క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. బీఎన్ఎస్ యాక్టులో (BNS Act) కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ అమలులోకి వచ్చిన రెండో రోజే ఎమ్మెల్యేపై కేసు నమోదు అయ్యింది. నిన్న (మంగళవారం) జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జెడ్పీ సీఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్ళే సమయంలో ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి అడ్డుకుని బైఠాయించి నిరసనకు దిగారు. దీనికి సంబంధించి జెడ్పీ సీఈవో ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221,126 (2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Andhra Pradesh: టీఎంసీ ఎంపీ వ్యాఖ్యలపై వైసీపీ సంబరాలు..!


అసలేం జరిగిందంటే...

కాగా.. నిన్న (మంగళవారం) జరిగిన కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర గందరగోళం సృష్టించారు. ఇటీవల హుజురాబాద్‌ నియోజకవర్గంలో విద్యారంగానికి సంబంధించి నెలకున్న సమస్యలపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి హాజరైన ఎమ్‌ఈవోలను డీఈవో బదిలీ చేయడంపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే డీఈవోను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని పట్టుబట్టారు. దళితబంధు అంశంతో పాటు డీఈవో అంశంపై కలెక్టర్ పమేలా సత్పతి సమాధానం చెప్పాలని కౌశిక్‌ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. కలెక్టర్‌ను వెళ్లనీయకుండా ఎమ్మెల్యే అడ్డుకుని అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. ఈ ఘటనపై జెడ్పీ సీఈవో అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసును నమోదు చేశారు పోలీసులు.


ఇవి కూడా చదవండి...

PM Narendra Modi: అబద్ధాలు.. పిల్లచేష్టలు!

Gold and Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి రేట్లు

Read Latest Telangana News AND Telugu News

Updated Date - Jul 03 , 2024 | 10:16 AM

Advertising
Advertising