Seethakka: కేటీఆర్ బుద్ధిగా పనిచేయ్.. మంత్రి సీతక్క హితవు
ABN, Publish Date - Jan 25 , 2024 | 10:49 AM
Telangana: అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ కేటీఆర్ అనేక సార్లు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అలాగే మంత్రులు కూడా కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టే పనిలో పడ్డారు. తాజాగా కేటీఆర్‌పై మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు.
రాజన్న సిరిసిల్ల, జనవరి 25: అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (BRS MLA KTR) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ కేటీఆర్ అనేక సార్లు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అలాగే మంత్రులు కూడా కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టే పనిలో పడ్డారు. తాజాగా కేటీఆర్‌పై మంత్రి సీతక్క (Minister Seethakka) విరుచుకుపడ్డారు. ఇకపై బుద్దిగా పనిచేసుకోవాలంటూ కేటీఆర్‌కు హితవుపలికారు. గురువారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. దర్శనానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు.
కేటీఆర్‌కు మైండ్ పని చేయడం లేదని విమర్శించారు. విధ్వంస రాజకీయాలకు కేటీఆర్ పాల్పడుతున్నారన్నారు. అధికారం లేకుండా ఎమ్మెల్యే ఉండలేకపోతున్నారని దుయ్యబట్టారు. ‘‘మీ అహంకారమే మీ ఓటమికి కారణం’’ అని అన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినా ప్రమాణ స్వీకారం చేయడం లేదన్నారు. తమపై మాట్లాడే ముందు కేటీఆర్‌కు బుద్ధి మైండ్ ఉండాలా అంటూ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తారన్నారు. తాము సక్రమంగా పని చేస్తేనే మళ్ళీ అధికారం ఇస్తారని.. చేయకపోతే అవకాశం ఇవ్వరన్నారు. కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పని చెయ్ అంటూ మంత్రి సీతక్క హితవుపలికారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 25 , 2024 | 10:49 AM