ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Huzurabad: హుజూరాబాద్‌లో ఉద్రిక్తత.. అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..

ABN, Publish Date - Nov 09 , 2024 | 04:01 PM

దళిత బంధు రాని వారంతా దరఖాస్తు చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే రెండో విడత దళిత బంధు ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ధర్నా, రాస్తారోకోకు పిలుపునిచ్చారు.

MLA Padi Kaushik Reddy

కరీంనగర్: హుజురాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కౌశిక్ రెడ్డి ధర్నా చేపట్టారు. అనుమతి లేకుండా వందలాది ఒక్కసారిగా అంబేడ్కర్ చౌరస్తా వద్దకు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేతో సహా పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.


దళిత బంధు రాని వారంతా దరఖాస్తు చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే రెండో విడత దళిత బంధు ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ధర్నా, రాస్తారోకోకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పెద్దఎత్తున దరఖాస్తుదారులతో కలిసి హుజూరాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్దకు ఎమ్మెల్యే చేరుకున్నారు. వారితోపాటు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కలిసి పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే వారిని అడ్డుకునేందుకు హుజురాబాద్, జమ్మికుంట సీఐలు, ఎస్ఐలు తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని నిలువరించే ప్రయత్నం చేశారు.


ఈ సందర్భంగా పోలీసులు, నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపు చేసేందుకు దళిత బంధు లబ్ధిదారులతోపాటు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు వ్యాన్‌లో ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వారి మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు అతన్ని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే ఆందోళనకారులను వ్యానులో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. అయితే మహిళా పోలీసులు లేకపోవడంతో మహిళా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసేందుకు వెనకడుగు వేశారు. అనంతరం మహిళా కానిస్టేబుళ్లను పిచిలించి రోడ్డుపై భైఠాయించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. నిరసన నేపథ్యంలో వరంగల్- కరీంనగర్ జాతీయ రహదారిపై దాదాపు గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి.

ఈ వార్తలు కూడా చదవండి:

KTR: మిత్తీతో సహా చెల్లిస్తాం.. కేటీఆర్ వార్నింగ్

Trump Tower: హైదరాబాద్‌లో ట్రంప్‌ టవర్లు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 09 , 2024 | 04:03 PM