ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Karimnagar: కరీంనగర్‌లో విషాదం.. డాక్టర్లు చెప్పిన వార్త విని..

ABN, Publish Date - Oct 16 , 2024 | 09:31 AM

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన రాజు, జమున దంపతులకు ఉక్కులు(5) అనే కుమార్తె ఉంది. ఏకైక సంతానం కావడంతో బాలికను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.

కరీంనగర్: ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు బాగా పెరిగిపోతున్నాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా మృత్యువాత పడుతున్నారు. అప్పటివరకూ కళ్లేదుట తిరిగిన వాళ్లు కాలం చేస్తున్నారు. పండగలు, వివాహాలు సహా ఇతర వేడుకల్లో డీజే చప్పుళ్లకు డాన్సులు చేస్తూ హార్ట్ ఎటాక్‌తో ఎంతో మంది చనిపోతున్నారు. వీటికి సంబంధించిన వార్తలు, వీడియోలు మనం తరచుగా సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. అయితే అప్పటివరకూ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా తిరిగిన వ్యక్తులు సైతం హఠాత్తుగా మృతిచెందడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు.


తాజాగా అలాంటి ఘటనే ఒకటి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. అప్పటివరకూ కళ్లేదుటే ఆడుకున్న ఐదేళ్ల చిన్నారి విగతజీవిలా పడి ఉండడం చూసి కుటుంబసభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఐదేళ్లకే నీకు నూరేళ్లు నిండిపోయాయా అంటూ శోకసంద్రంలో మునిగిపోయారు.


కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన రాజు, జమున దంపతులకు ఉక్కులు(5) అనే కుమార్తె ఉంది. ఏకైక సంతానం కావడంతో బాలికను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే ఎప్పటిలాగానే నిన్న (మంగళవారం) ఉదయం నిద్రలేచిన బాలిక కాసేపు ఆడుకుంది. కాసేపటి తర్వాత తనకు కళ్లు తిరుతున్నాయనే విషయాన్ని తల్లికి తెలియజేసింది. అయితే బాలికను తల్లి జమున స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు పరీక్షించి వెంటనే హన్మకొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో హుటాహుటిన తల్లిదండ్రులు చిన్నారిని తీసుకుని హన్మకొండ ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే వైద్యులు పరీక్షిస్తుండగానే ఉక్కులు మృతి చెందింది. బాలిక గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉక్కులుకు పుట్టినప్పటి నుంచే గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని, ఆ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించలేకపోయాని డాక్టర్లు తెలిపారు. ఆ సమస్యల వల్ల చిన్నారికి గుండెపోటు వచ్చి ఉంటుందని వెల్లడించారు.


తమ కుమార్తె ఉక్కులు మృతిచెందిందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నామని, కుమార్తె ఇక లేదనే విషయాన్ని ఎలా తట్టుకోవాలంటూ గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఉక్కులు మరణవార్తతో జమ్మికుంటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి:

BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక సమావేశం నేడు..

CM Revanth Reddy: సీఎం సంతకం చేసినా బదిలీల్లేవ్‌!

Updated Date - Oct 16 , 2024 | 09:34 AM